రాష్ట్రీయం

ప్రజావేదిక ప్రభుత్వ ఆధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణానది కరకట్టపై నున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నివాస భవన ప్రాంగణంలోని ప్రజావేదిక భవనాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం శనివారం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ వేదికలో ఒకేసారి దాదాపు 600 మంది పైగా సమావేశమయ్యేలా సౌకర్యాలున్నాయి. ఈ నెల 24వ తేదీ తొలిసారిగా జరగబోయే కలెక్టర్‌ల సమావేశానికి ఈ వేదిక ఒక్కటే అనువుగా భావించిన ప్రభుత్వ ఆదేశాలపై సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్‌లు శుక్రవారం పరిశీలించడం... శనివారం మందీమార్బలంతో వచ్చి అక్కడున్న కొన్ని పరికరాలను, చంద్రబాబు వ్యక్తిగత సామగ్రిని వెలుపలకు చేర్చి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే ఈ వేదికను ప్రతిపక్ష నేతకు అప్పగించాలంటూ తాము రాసిన లేఖకు కనీసం సమాధానం ఇవ్వకుండా, ముందస్తు సమాచారం కూడా లేకుండా తమ వ్యక్తిగత సామగ్రిని రోడ్డున పడవేసారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదికను స్వాధీనం చేసుకోవటం కక్ష సాధింపు చర్యేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇవ్వడం ఇష్టం లేకపోతే రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు మాట్లాడుతూ ఈ ప్రజావేదిక బాబు నివాసానికి అనుబంధంగా ఉందన్నారు. అందులోని సామగ్రిని ఖాళీ చేసేటప్పుడు కనీసం సమాచారం ఇవ్వలేదని, ఉదయం 10 గంటలకు తాము వచ్చేలోపు వస్తువులను ఆరు బయట పడేశారని అన్నారు.
ప్రజాదర్బార్‌లో కీలకమైన ఫైళ్లు ఏముంటాయి: మంత్రి వెలంపల్లి
ప్రజాదర్బార్ కోసం ఏర్పాటైన ప్రజావేదికలో టీడీపీ నేతలు చెప్పే కీలకమైన ఫైళ్లు ఏముంటాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అక్కడ ప్రజా సమస్యల ఫైళ్లు మాత్రమే ఉండాలన్నారు. అలా కాకుండా సింగపూర్‌తో రహస్య ఒప్పందాలు, హెరిటేజ్ ఆస్తుల నివరాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ప్రజావేదికను ప్రభుత్వానికి అప్పగించాలని గతంలోనే నోటీసులిచ్చామని, అయినా ఖాళీ చేయలేదని అన్నారు. సీఎం జగన్ ప్రజా సొమ్మును ఆదా చేయాలని చూస్తున్నారు. బాబు లాగా దుబారా చేయడం లేదన్నారు.
ఇంకా భ్రమల్లోనే: ఎమ్మెల్యే విష్ణు
టీడీపీ నేతలు ఇంకా తాము అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో మునిగి తేలుతున్నారంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. అసలు అధికారంపోయాక ప్రజావేదికలో బాబుకు పని ఏమిటని ప్రశ్నించారు. అక్కడ విలువైన వస్తువులు ఏమున్నాయో చెప్పాలన్నారు. ప్రభుత్వ అవసరాల కోసమే ప్రజావేదిక అన్నారు. అతి టీడీపీ ఆస్తికాదన్నారు. అయితే టీడీపీ నేతలు అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. బాబు లేని సమయంలో రాజ్యసభ సభ్యులే వెళ్లిపోయారు.. ఇంకా ఫైళ్ల గురించి మాట్లాడతారేమిటని విష్ణు ప్రశ్నించారు.
మంత్రి బొత్స పరిశీలన
ప్రజావేదికను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న మరు క్షణమే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఈ నెల 24వ తేదీ జరగనున్న కలెక్టర్‌ల సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
చిత్రం...ప్రజావేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ