రాష్ట్రీయం

శరవేగంగా నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ కొత్త భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం ఉన్నతాధికారులతో ఆయన ఈ అంశంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషితో పాటు రోడ్లు, భవనాల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు అనుగుణంగా భవనాల నిర్మాణం కొనసాగాలని కేసీఆర్ సూచించారు. ప్రస్తుతం సచివాలయంలో తొమ్మిది భవనాలు (బ్లాకులు) ఉన్నప్పటికీ, ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయని, చూసేందుకు కూడా ఇవి బాగాలేవని సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. దేశానికే ఆదర్శంగా ఉండేలా సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలు ఉండాలని సూచించారు. ఈ నెల 27 న ఈ భవనాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించడం వల్ల భవనాల ప్లాన్లను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు తమ తమ అభిప్రాయాలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త్భవనాల నిర్మాణాన్ని అతివేగంగా కొనసాగించేందుకు అధికారులు సమ్మతి తెలిపారు. సీఎం ఆలోచనల మేరకు భవనాలను నిర్మించేందుకు అంగీకరించారు. నిర్ణీత ప్లాను ప్రకారం, నిర్ణీత సమయంలో భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అహోరాత్రులు కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణం తరహాలోనే అసెంబ్లీ, సచివాలయం భవనాల నిర్మాణాన్ని కూడా రికార్డు సమయంలో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిసింది.