రాష్ట్రీయం

28న ఏపీ సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీ సెట్) నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు తెలిపారు. ఏయూ అకడమిక్ సెనేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్ష అక్టోబర్ 20 జరుగుతుందని తెలిపారు. ఏపీ సెట్ పరీక్షలకు గాను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 12 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 19 వరకూ రూ.1000 అపరాధ రుసుంతోను, సెప్టెంబర్ 26 వరకూ రూ.2000 అపరాధ రుసుంతోను అక్టోబర్ 3 వరకూ రూ.5000 అపరాధ రుసుంతోను దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఏపీ సెట్ పరీక్ష రుసుంగా జనరల్ విభాగాల అభ్యర్థులు రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.700 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏపీ సెట్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తారు. విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. ఏపీ సెట్ పరీక్షలు మొత్తం 30 విభాగాల్లో జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం విజువల్ ఆర్ట్స్ విభాగంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని, థియేటర్ ఆర్ట్స్, సంగీతం, నృత్యం, ఫైన్ ఆర్ట్స్ విభాగాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవన్నారు. ఈ సందర్భంగా ఏపీ సెట్ పరీక్షా పట్టికను వీసీ నాగేశ్వర రావు విడుదల చేశారు. కార్యక్రమంలో ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ కే శ్రీనివాసరావు, వర్శిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బైరాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ఏపీ సెట్ పరీక్షా పట్టికను విడుదల చేస్తున్న ఏయూ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగేశ్వర రావు