రాష్ట్రీయం

ఎత్తిపోతలతో చిక్కులెన్నో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరి మిగులు జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోకి ఎత్తిపోయడం వల్ల తెలంగాణకు ఉపయోగం లేదని, పైగా నీటి పంపకాలపై చిక్కులు వస్తాయని సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ చెప్పారు. గోదావరి వరద జలాలను వాడుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సొంత ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం శ్రేయస్కరమని ఆయన చెప్పారు. ఉమ్మడి ప్రణాళికలు, ఉమ్మడి ఖర్చు, ఉమ్మడి ఎత్తిపోతల పథకాలు చిక్కులకు దారితీస్తాయన్నారు. ఉమ్మడి ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయమవుతుందని ఈ మేరకు అంచనాలు తయారు చేస్తున్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు తొందరపడకుండా మరింత లోతుగా అధ్యయనం చేసి ఒక నిర్ణయాన్ని రావాలన్నారు. ఎవరికి వారు ప్రాజెక్టులు నిర్మించుకుంటే మంచిదన్నారు. ఉమ్మడి వల్ల ఆర్థికంగా నష్టమని, తెలంగాణ నీటి వినియోగం లేక, ఆర్థికంగా ఖర్చుపెట్టి రెండు రకాలుగా నష్టపోతుందన్నారు. గోదావరి జలాలను శ్రీశైలంకు తెలంగాణ భూభాగం ద్వారానే మళ్లిస్తామని ఎంతో విశాల హృదయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన చేశారని, ఈ ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నామని ఆంధ్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విభజన తర్వాత శ్రీశైలం ఆంధ్ర, నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ అజమాయిషీలోకి వచ్చాయన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణకు లిఫ్ట్ ద్వారా 70 టీఎంసీ నీరు, ఆంధ్రాకు గ్రావిటీ, కాల్వల ద్వారా పోతిరెడ్డిపాడుకు 120 టీఎంసీ, వెలిగొండ ప్రాజెక్టుకు 43.50 టీఎంసీ, హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీ కలిపి 203 టీఎంసీ నీరు పోతోందన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు 106.20 టీఎంసీ ద్వారా 6.38 లక్షల ఎకరాలకు, ఆంధ్రాకు 174.80 టీఎంసీ ద్వారా 16.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నీటి పంపకం విశే్లషిస్తే ఉమ్మడి పొత్తు పొసగదన్నారు. గోదావరి మిగులు జలాల వినియోగంలో కూడా ఆంధ్రాకు ఎక్కువ అవకాశం, వెసులుబాటు ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక్కసారి వరద వస్తే 200 టీఎంసీ నీటిని ఒడిసిపట్టుకునే అవకాశం ఉందన్నారు. మూడుసార్లు వరద వస్తే గ్రావిటీ ద్వారా 600 టీఎంసీ నీటిని పట్టుకునే అవకాశం ఆంధ్రాకు ఉందన్నారు. ఈ అవకాశం తెలంగాణకులేదన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల తర్వాత తెలంగాణలో వరదనీటిని ఒడిసిపట్టుకునే అవకాశం లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా 16 టీఎంసీలు, తుపాకుల గూడెం ద్వారా 7 టీఎంసీలు కలిపి 23 టీఎంసీ మాత్రమే ఒడిసిపట్టుకునే అవకాశం ఉంది. తెలంగాణలో గోదావరి వరద నీటిని వాడుకోవడానికి లిఫ్ట్‌లు మాత్రమే శరణ్యమన్నారు. రోజుకు రెండు టీఎంసీలు వంద రోజులు లిఫ్ట్ చేసినా కేవలం 200 టీఎంసీలు మాత్రమే గోదావరి వరద నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. గోదావరి జలాల వినియోగంలో కూడా
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం 79 శాతం, ఆంధ్రాలో 21 శాతం ఉందన్నారు. వినియోగంలో ఆంధ్రా 25 శాతం నీటిని అధికంగా వాడుకుంటోందన్నారు. ఉమ్మడి ఖర్చుతో పై రెండు ప్రాజెక్టుల్లో గోదావరి వరద నీటిని ఎత్తిపోయడం తెలంగాణకు లాభం లేదన్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో గోదావరి వరద నీటిని ఎత్తిపోసినట్లయితే ఎగువ రాష్ట్రాలు నీటి వాటాను డిమాండ్ చేస్తాయన్నారు. అదే ఎవరి ప్రాంతానికి వారు నీటి కొరతను తీర్చుకోవడానికి ఉపయోగిస్తే అభ్యంతరం ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రం తన ప్రాంతంలోని దుమ్ముగూడెం, తుపాకుల గూడెం లేదా రాంపూర్ నుంచి గోదావరి జలాలను రోజుకు 2 లేదా 3 టీఎంసీల లిఫ్ట్ చేసి మునే్నరు నది పైన ఒక బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు, అక్కడి నుంచి దేవరకొండ సమీపంలో ఉన్న ఏడు టీఎంసీల నక్కల గండి ప్రాజెక్టుకు లింక్ చేసి 3.70 లక్షల ఎకరాలు ఎస్‌ఎల్‌బీసీ సాగుకు అక్కడి నుంచి ఎగువ డిండికి, కల్వకుర్తికి, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టుకు లింక్ చేసి నారాయణ్‌పేట్, మక్తల్, కొడంగల్‌కు సాగునీటిని అందించవచ్చన్నారు. ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ, వైకుంఠపురం నుంచి 45 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టుకు లిఫ్ట్ చేయాలని, ఆ మేరకు అక్కడి నుంచి అనుసంధానాల ద్వారా రాయలసీమ మొత్తానికి , కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఆంధ్ర, తెలంగాణ మధ్య నీటి పంపకం ఫార్ములా సరిగా లేదన్నారు. గోదావరి నీటిని శ్రీశైలానికి మళ్లించాలన్నా, నల్లమల అడవుల్లో కాల్వలు తవ్వేందుకు పర్యావరణ అనుమతులు రావన్నారు. కృష్ణా నది నికర జలాల వినియోగంలో తెలంగాణకుఅన్యాయం జరిగిందన్నారు. మొత్తం 811 టీఎంసీ జలాల్లో ఆంధ్రాకు 512 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ కేటాయింపు ఉందన్నారు. ఈ అన్యాయాన్ని కొత్త ట్రిబ్యునల్ ముందుగా సవరించుకోవాలన్నారు. కృష్ణా మిగులు జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి సీమాంధ్రలోని 4 ప్రాజెక్టులు 150. 50 టీఎంసీ, తెలంగాణలోని మూడుప్రాజెక్టులు 77 టీఎంసీల వినియోగం మాత్రమేనన్నారు. ఒకవేళ గోదావరి జలాలను శ్రీశైలంలో ఎత్తిపోసినా, గ్రావిటీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ వెంటనే నీటిని మళ్లిస్తుందన్నారు. ఆ సదుపాయం తెలంగాణకు లేదన్నారు.

చిత్రం... సాగునీటి రంగ నిపుణుడు దొంతుల లక్ష్మీనారాయణ