రాష్ట్రీయం

శాంతించిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : గత ఐదారు రోజులుగా పరీవాహక ప్రాంతాలను వణికించిన కృష్ణమ్మ ఎట్టకేలకు శాంతించింది. దీంతో ఇటు ప్రజలు అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రానికి పులిచింతల గేట్లను పూర్తిగా మూసివేశారు. అత్యధికంగా ఏడులక్షల క్యూసెక్కుల నీరు పులిచింతల నుంచి దిగువకు వచ్చింది. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను తొమ్మిది అడుగుల మేర పైకి ఎత్తి ఉంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. కాలువలన్నింటికీ కల్పి 17వేల క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ఈ ఐదు రోజుల్లోనే ఇటీవల కాలంలో ఎక్కడాలేని విధంగా 270 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. వాస్తవానికి కృష్ణాడెల్డాలో 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌లో కేవలం 80 టీఎంసీల నీరు సరిపోతుంది. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కృష్ణా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. గేట్లను పూర్తిగా మూసివేసే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ఎగుల ప్రాంతానికి వస్తే కర్నాటక, మహారాష్ట్రాల్లో వర్షాలు బాగా తగ్గుముఖం పడ్డాయి. జూరాల జలాశయం ఇన్‌ప్లో 3.54 లక్షలు క్యూసెక్కులు కాగా 21 గేట్ల ద్వారా 3.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుం 8.434 టీఎంసీ నిలువ ఉంది. శ్రీ శైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతున్నది. ఇన్‌ప్లో 4.65 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ప్లో 3.79 లక్షలుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.30 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 218.81 టీఎంసీలకుగాను 200.65 టీఎంసీల నీరు ఉంది. కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,931 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42వేల క్యూసెక్కుల నీరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400, హందీనీవాకు 2026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 34వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. శ్రీశైలంలో 10 గేట్లను పైకి ఎత్తి 2.68 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదలుతున్నారు. ఇక సాగర్‌కు వరద బాగా తగ్గుముఖం పట్టి 2.56 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు ఆ మొత్తాన్ని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులు ఉంది. 11 గేట్లను మూసి వేశారు.
చిత్రం...ప్రకాశం బ్యారేజీ వద్ద నిండుగా కృష్ణమ్మ