ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ బెదిరింపులకు పారిశ్రామికవేత్తలు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: రాష్ట్ర విభజన నాటికి ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా లేదని, విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో అనేక పరిశ్రమలు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సులభతర వాణిజ్యంలోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామని తెలిపారు. టీడీపీ పాలనలో 5.13 లక్షల ఉద్యోగాలు కల్పించారని వైసీపీ నేతలే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలంటూ ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి విడుదల చేసిన శే్వతపత్రం హాస్యాస్పదంగా ఉందని, ఉన్న పరిశ్రమలు చెడగొట్టే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఆరోపించారు. వైసీపీ నేతల బెదిరింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడుతుంటే, ఉన్న వారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారని విమర్శించారు.