ఆంధ్రప్రదేశ్‌

బీజెపీలో చేరి టీడీపీ పాట పాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: వరద బాధితులకు సహాయం చేయాలని, బీజెపీలో చేరిన టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదల అంచనాలు వేయించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా చేయాలన్నారు. బీజెపీలో చేరిన వారంతా టీడీపీ పాట పాడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఫల్యాలను సరిచేసుకోవాలన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. సిట్ ఓపెన్ చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. గజం స్థలం కూడా కబ్జాకు గురైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.
భూకబ్జాలకు పాల్పడే మంత్రే టీడీపీ హయాంలో సిట్‌కు ఫిర్యాదు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. ఇసుక విధానాన్ని పారదర్శకం చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఫీజుల రీ యింబర్స్‌మెంట్‌కు సంబంధించి నాలుగు వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందన్నారు. త్వరలో విశాఖ-విజయవాడల మధ్య విమాన సర్వీసు మెరుగుపడుతుందన్నారు. బోగాపురం విమానాశ్రయం, విశాఖ విమానాశ్రయం నుంచి విమానల నిర్వహణపై త్వరలో స్టేక్‌హోల్డర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. టగ్ ప్రమాద సంఘటనపై కమిటీ త్వరలో నివేదికనివ్వనుందని, తదుపరి చర్యలుంటాయన్నారు. వీఎంఆర్‌డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, కలెక్టర్ వీ.వినయ్‌చంద్, సీపీ ఆర్‌కె మీనా పాల్గొన్నారు.