రాష్ట్రీయం

నేడు ఇంటర్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/కాకినాడ, ఏప్రిల్ 18: తొలిసారిగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10 గంటలకు విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29న ఎంసెట్-2016 నిర్వహించనున్న నేపథ్యంలో అదే రోజు సాయంత్రం ప్రిలిమినరీ కీ విడుదల చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రవేశ పరీక్షకు హాజరైన కొన్ని గంటల్లోనే ప్రిలిమినరీ కీ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుని, జయాపజయాలను అంచనా వేసుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.
మే 9న ఇంటర్మీడియెట్ వెయిటేజీతో సహా ర్యాంక్‌లు విడుదల చేసి, మే 27న అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎంసెట్-2016 కన్వీనర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. సర్ట్ఫికెట్స్ వెరిఫికేషన్ జూన్ 6న నిర్వహించి, జూన్ 9నుండి 18వ తేదీ వరకు ఆప్షన్ల కేటాయింపునకు అవకాశం కల్పించారు. జూన్ 22నుండి సీట్ల కేటాయింపు, జూన్ 27వ తేదీ నుండి తరగతులు ప్రారంభించడానికి ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది.
సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఎంసెట్‌కు హాజరు కానున్నట్టు సాయిబాబు పేర్కొన్నారు. ఈనెల 21నుండి 27వ తేదీ వరకు హాల్‌టిక్కెట్లను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎపిఎంసెట్.ఒఆర్‌జి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 10నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని డాక్టర్ సాయిబాబా వివరించారు.
27న పాలిసెట్.. మే 9న ఫలితాలు
రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లోని 80 వేల సీట్ల భర్తీ కోసం ఈ నెల 27న పాలిసెట్ నిర్వహించబోతున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి ఉదయలక్ష్మి వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు 333 కేంద్రాలను ఏర్పాటు చేశామని, లక్షా 38వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. మే 9న ఫలితాలు ప్రకటిస్తామన్నారు.