Others
వెంకీ చేతుల మీదుగా 3 మంకీస్ టీజర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 September 2019
కామెడీతో క్రాక్ పుట్టించిన జబర్దస్త్ టీంనుంచి సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని మురిపించేందుకు వస్తున్నారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్. సినిమాలపై ఫోకస్ పెట్టిన ముగ్గురూ లీడ్ రోల్స్‌లో వస్తున్న చిత్రం -3 మంకీస్. దర్శకుడు అనిల్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రానికి నాగేశ్ నిర్మాత. తాజాగా సీనియర్ హీరో వెంకటేశ్ చేతుల మీదుగా సినిమా టీజర్ రిలీజైంది. ముగ్గురు స్నేహితుల కథగా 3 మంకీస్ ఉండనుందన్న విషయం టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. టైమింగ్ డైలాగ్స్‌కు అవకాశం కల్పించే -బ్యాచిలర్స్ బ్యాచ్‌గా కథతో సినిమా రూపొందించినట్టు తెలుస్తోంది. షకలక శంకర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. విడుదలకు సిద్ధమవుతోన్న సినిమా -3 మంకీస్‌లో ఏ మంకీని పైకి లేపుతుందో చూడాలి.