క్రైమ్/లీగల్

అదుపు తప్పి కారు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, అక్టోబర్ 12: అతివేగంగా వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా ఇరువురు తీవ్రంగా గాయపడినట్లు కొత్తూరు సీఐ చంద్రబాబు తెలిపారు. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో కొత్తూరు మండల సమీపంలోని తిమ్మాపూర్ వద్ద ముందు వెళ్తున్న కారుకును ఓవర్‌టెక్ చేస్తుండగా కారు ఆదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ జాన్‌రోస్ (35) అక్కడికక్కడే మృతిచెందిగా స్వేత, పక్షిత్, డేషిత తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్యశాలకు తరలించగా మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న చర్చిని దర్శించుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో సంఘటన చోటు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి బంధువు దినేష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు వివరించారు.