ఆంధ్రప్రదేశ్‌

తెలుగులో రాష్ట్ర చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: వివిధ చట్టాలను తెలుగులోకి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ (సవరణ) చట్టం, స్విమ్స్ వర్సిటీ (సవరణ) చట్టం, సింహాచలం దేవస్థానం పంచగ్రామాల చట్టం, తదితర 18 చట్టాలను తెలుగులో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది.
అసుపత్రి అభివృద్ధి కమిటీల ఏర్పాటు
రాష్ట్రంలో ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రులు, ఆయుష్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు అసుపత్రి అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. మూడు సంవత్సరాల పాటు కమిటీ కాలపరిమితిగా నిర్ణయించింది. మూడు నెలల పాటు అమల్లో ఉండేలా పేషెంట్ రికార్డు కార్డును జారీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఆధారంగా ఈ కార్డు జారీ చేస్తారు.