గ్యాప్‌లేకుండా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యాక్షన్ కామెడీ కలబోత -రవితేజ. హీరోగా తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకుని ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో రవితేజ క్రేజ్ ఓ రేంజ్‌కి చేరింది. అయితే కొంతకాలంగా రవితేజ చేస్తోన్న ప్రాజెక్టులేవీ సక్సెస్‌ను అందుకోలేకపోయాయి. ప్లాప్ సినిమాలతో రవితేజ పనైపోయిందన్న పరిస్థితుల్లో చేస్తోన్న తాజా ప్రాజెక్టు -డిస్కోరాజా. వీఐ ఆనంద్ తెరకెక్కిస్తోన్న డిస్కోరాజాతో తన పూర్వపు ఫాంలోకి వచ్చేస్తానన్న నమ్మకంతో ఉన్నాడు రవితేజ. తరువాత ప్రాజెక్టుగా గోపీచంద్ మలినేనితో సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. మలినేని -రవితేజ కాంబోలో వచ్చిన రెండు చిత్రాలూ యాక్షన్పరంగాను, కామెడీపరంగానూ మంచి మార్కులే సంపాదించాయి. కొత్త ప్రాజెక్టులోనూ అదే ఫార్ములా ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫసీర్ పాత్ర చేస్తూనే పూర్తి కామెడీ పండించే పాత్రను రవి చేయనున్నాడట. ‘విక్రమార్కుడు’ చిత్రం మాదిరిగానే -తోపు విలన్ కొమ్ములు వంచే ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ కనిపిస్తాడట. ఈ సినిమా కోసం రవితేజతో శృతిహాసన్ జోడీ కడుతుంది. ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసెకెళ్తూనే -మరో ప్రాజెక్టునూ సెట్‌చేసి లైన్లో పెట్టాడట. మాస్ ఎంటర్టైనర్లతో ఊర మార్కేసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కినతో ప్రాజెక్టును ఫైనల్షేప్కు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడట. సినిమా చూపిస్తమావ, నేనులోకల్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన త్రినాథరావు -కామెడీ ప్రధానంగా సాగే కథను రవితేజ కోసం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయట.