రాష్ట్రీయం

ఎస్‌ఎస్‌ఏలో పోస్టుల భర్తీ :నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: సమగ్ర శిక్షా అభియాన్‌లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సిస్టం అనలిస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామర్లు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ల నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందుకు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలను సమగ్రశిక్షా డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నవంబర్ 18 నుండి 23 వరకూ స్వీకరిస్తామని, డిసెంబర్ రెండో వారంలో హాల్‌టిక్కెట్లు జారీచేసి ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. 33 జిల్లాల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు 144, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 138, సిస్టం అనలిస్టులు 12, అసిస్టెంట్ ప్రోగ్రామర్లు 27, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్‌పర్సన్లు 383 మందిని ఎంపిక చేస్తామని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఓపెన్ వర్శిటీ పీజీ పరీక్షల రుసం గడువు
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ, ఎంబీఏఐ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ , పీజీ డిప్లొమో, పలు సర్ట్ఫికేట్ కోర్సుల వార్షిక పరీక్ష రుసుముల చెల్లింపునకు గడువును నవంబర్ 10వ తేదీ వరకూ పొడిగించనట్టు వర్శిటీ అధికారులు తెలిపారు.