క్రైమ్/లీగల్

తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జనవరి 14: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం రాత్రి వనపర్తి సమీపంలోని ఎకో పార్కు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి కారు దూసుకోని వెళ్లడంతో కారును ఆపడానికి వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ (హెచ్‌సీ నెంబర్ 1733) సలీమ్‌ఖాన్ (57) మృతి చెందాడు. అక్కడే ఉన్న మిగితా పోలీస్ బృందం హుటాహుటిన వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్న సలీమ్‌ఖాన్ ఎస్‌ఎస్‌టిలో విధులు నిర్వహిస్తూ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పెబ్బేరు నుండి వనపర్తికి వస్తున్న టీఎస్ 32 9778 అనే షిప్ట్ డిజైర్ వాహనం అతివేగంగా ఆజాగ్రత్తగా నడపడం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లడంతో తలకు, శరీరం అంతా తీవ్రగాయాలై ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా తోటి సిబ్బంది వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు సలీమ్‌ఖాన్‌కు భార్య శంషాద్‌భేగం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన కారు యజమాని పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రభుత్వపరంగా ఆదుకుంటాం: ఎస్పీ అపూర్వ రావు
పోలీసు విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ సలీమ్‌ఖాన్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ అపూర్వ రావు వెంటనే ఏరియా ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదర్చారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె తెలిపారు. ప్రభుత్వపరంగా వచ్చే అన్ని బెనిఫిట్స్‌ను అందజేస్తామని తెలిపారు. విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడం దురదృష్టకరమని, ఆయన మృతి పోలీసు శాఖకు తీరనిలోటని చెప్పారు. మృతుని అంత్యక్రియలకు గాను తక్షణ సహయంగా రూ.20వేలు మృతుని కుటుంబ సభ్యులకు ఎస్పీ అందజేశారు. అలాగే పోలీసు అసోసియేషన్ తరపున మరో రూ.20వేలు అందిస్తున్నట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మహబూబ్‌నగర్‌లో పోలీస్ లాంచనాలతో సలీమ్‌ఖాన్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో వనపర్తి అదనపు ఎస్పీ షాకిర్‌హుస్సేన్, ఆర్డీఓ చంద్రారెడ్డి, డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ సూర్యనాయక్, తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, రూరల్ ఎస్‌ఐ షేక్‌షఫీ, రిజర్వు ఇనిస్పెక్టర్ వెంకటేష్, శ్రీరంగాపురం ఎస్‌ఐ ఖాధర్, పోలీసు అధికారులు, మిత్రులు, బంధువులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సలీమ్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు.
''చిత్రాలు..మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ సలీమ్‌ఖాన్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ అపూర్వారావు, జెసి వేణుగోపాల్.
*హెడ్‌కానిస్టేబుల్ సలీమ్‌ఖాన్ (ఫైల్‌ఫొటో)