ఆంధ్రప్రదేశ్‌

కరోనా పట్ల అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ప్రకటించారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ వైరస్‌కు సంబంధించిన కేసులేవీ గుర్తించ లేదన్నారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో కరోనాకు సంబంధించి
5 పడకలతో కూడిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటిలేటర్లు సిద్ధం చేయాలన్నారు. వైరస్‌పై తక్షణం రాష్ట్రంలో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ కేసులు నమోదు కాలేదని, ప్రజలు భయపడవద్దని పునరుద్ఘాటించారు. అధికారులు నిరంతర అప్రమత్తతో ముందు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ సంచాలకులు అరుణకుమారి, ఏపీ వైద్య, విధానపరిషత్ కమిషనర్ రామకృష్ణ, వైద్య విద్యా సంచాలకులు వెంకటేశ్, డీహెచ్‌సీడీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి ఆళ్ల నాని