డబ్ల్యుఎఫ్‌ఎల్.. ఓ న్యూ ట్రెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ -అనేది అద్భుతమైన భావన. అది యూత్‌కే పరిమితం కాదు. ప్రేమ భావనను ఆస్వాదించాలని ఆశపడే వాళ్లందరినీ టార్గెట్ చేస్తూ వస్తోన్న చిత్రమే -వరల్డ్ ఫేమస్ లవర్.
యంగ్ సెనే్సషన్ విజయ్ దేవరకొండ, రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థ్రెసా, ఇస్‌బెల్లా లీడ్‌రోల్స్‌లో దర్శకుడు క్రాంతిమాధవ్ తెరకెక్కించిన చిత్రం -వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కెఎస్ రామారావు నిర్మించిన చిత్రం వాలెంటైన్స్ డే రోజున థియేటర్లకు వస్తోంది. ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ నిర్మాత కెఎస్ రామారావు మీడియాతో ముచ్చటించారు.
* పెళ్లిచూపులు సినిమా చూసిన తరువాత విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేకమైన ఆర్టిస్ట్ అనిపించాడు. అప్పుడే అతనితో సినిమా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో డిస్కషన్స్ జరిపినపుడు -ప్రాజెక్టు చేయడానికి ఓకే చెప్పాడు.
* 2018 అక్టోబర్ సెకెండ్‌వీక్‌లోనే సినిమా మొదలుపెట్టాం. కాకపోతే -చిన్నిచిన్ని కారణాలవల్ల మీడియాకు అప్‌డేట్స్ ఇవ్వలేకపోయాం. ప్రాజెక్టులో దర్శకుడు, ఆర్టిస్టులు కథపై ఏకాగ్రతతో పని చేస్తుండటం, ఎక్కువమంది ఆర్టిస్టుల కారణంగా ఎవరి బిజీ షెడ్యూల్స్ వాళ్లకుండటం వల్ల అప్‌డేట్స్ ఇచ్చే అవకాశం లేకపోయింది.
* సినిమా నిర్మాణానికి ఎక్కువ టైం పట్టడానికి కారణం -కాంబినేషన్స్ సెట్ చేసుకోవడంలో తలెత్తిన ఇబ్బంది ఒకటైతే, భిన్న దశల్లో కనిపించే హీరో మేకోవర్ గురించీ టైం తీసుకోక తప్పలేదు. అంతేతప్ప, ప్రాజెక్టు లేటైందన్న భావనైతే మాకు లేదు. సినిమా కొద్దినెలల క్రితమే థియేటర్లకు తెచ్చే చాన్స్‌వున్నా -క్రిస్మస్, సంక్రాంతి సీజన్‌కు తగిన జోనర్ కాకపోవడం, పండుగ సినిమాల కారణంగా ఆగాల్సి వచ్చింది. అచ్చమైన ప్రేమ కథ కనుక -వాలెంటైన్స్ డే ఆప్ట్ అని అనుకుంటున్నా.
* డిమాండ్‌వున్న ఆర్టిస్ట్ కావడంతో విజయ్‌తో సినిమా చేయాలన్న ఆలోచన చాలామంది నిర్మాతలకే ఉంటుంది. కాకపోతే డేట్స్ దొరక్కపోవచ్చు. ఆ ఉద్దేశంతోనే -సహ నిర్మాతలైన అభిషేక్ నామా, సునీల్ నారంగ్‌లు నిర్మాతలుగా ఈ ప్రాజెక్టులో కలిశారు.
* టెక్నికల్‌గా, ప్రజెంటేషన్‌పరంగా -దర్శకుడు క్రాంతిమాధవ్, విజయ్ దేవరకొండ ఎక్కువ ఎఫర్ట్‌పెట్టి న్యూట్రెండ్ సినిమా చేశారు. అందుకు రాశిఖన్నా, ఇస్‌బెల్లా, మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బెస్ట్ సపోర్ట్ అందించారు. క్యాథరిన్ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. ఓవరాల్‌గా ప్రాజెక్టుపై హ్యాపీగా ఉన్నాం.
* క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ స్టాండర్డ్స్‌కు తగిన ట్రెండీ సినిమా ఇది. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా యూత్ లైఫ్ ఫ్లేవర్డ్ కథను స్క్రీన్‌పై చూస్తారు.
* కథనుబట్టే సినిమా టైటిల్ ఉంటుందనటంలో సందేహం లేదు. కానీ, వరల్డ్ ఫేమస్ లవర్ అన్న టైటిల్ విషయంలో నేనూ కొంత సందిగ్ధత వ్యక్తం చేశా. దర్శకుడు చాలా స్పష్టంగా ఉన్నాడు కనుక కాదనలేకపోయా.
* డబ్ల్యుఎఫ్‌ఎల్ సినిమా తెలుగుతోపాటు -మలయాళం, హిందీ, తమిళం భాషల్లో రైట్స్ తీసుకున్న ఆయా నిర్మాతలు ఓకేసారి విడుదల చేస్తుండటం పెద్ద చిత్రమన్న సంతోషం కలిగిస్తోంది.
* భవిష్యత్ ప్రాజెక్టులు ఫలానా హీరోతో చేయాలన్న లెక్కలేమీ నాకుండవు. నిర్మాతగా మంచి హీరో దొరికితే సినిమా చేయాలనే ఉంటుంది. కాకపోతే కథ, దాని విధానం, కాలమాన పరిస్థితులు, హీరో షెడ్యూల్స్ ఇవన్నీ కుదిరితేనే ప్రాజెక్టు చేయగలుగుతాం. సో, భవిష్యత్ ప్రాజెక్టులమీద కచ్చితమైన సమాచారం ఇప్పుడే చెప్పలేం.
* ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు, సవాళ్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాల్సిన తరుణం వచ్చిందనిపిస్తోంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇద్దరి ముగ్గురి చేతుల్లో గుత్త్ధాపత్యంగా మారుతోంది. దీనివల్ల సినిమా ఫేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ప్రభావంతో కొందరికి న్యాయం, కొందరికి అన్యాయం జరగొచ్చు. దీనిపై లోతైన చర్చ జరిగాలి. పరిష్కారాలు అనే్వషించాలి. లేదంటే భవిష్యత్‌లో ప్రమాదం తప్పదు. సో, ఇండస్ట్రీ జనం ఎటువైపు పయనిస్తున్నామో సమీక్షించుకోవాల్సిన అవసరముంది.