Others
మేడారం ‘మేళా..’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 5 February 2020
- కోడిగూటి తిరుపతి 95739 29493
భక్త జన సందోహంతో..
అడవి పల్లె విరిసేను
వనదేవతల కొలుపుతో
మేడారం మురిసెను
జమిడిక డప్పు మోతతో..
చిలకల గుట్ట పరవశించేను
పసుపు కుంకుమార్చనతో
కనె్నపల్లి ముక్తి కాంతులీనేను
జన స్నానాలు, తలనీలాలతో..
జంపన్న వాగు ఎద ఉప్పొంగేను
బెల్లం బంగరు రాశితో..
తల్లి గద్దె తడిసి ముద్దయ్యేను
మేడారం జాతర..
ధిక్కార స్వరపేటిక
పౌరుషాల రణవేదిక
త్యాగాల సుమ మాలిక
మూలపుటమ్మల శౌర్య ప్రతీక
తెలంగాణ కుంభమేళా..
ఆదివాసీ సంబురాల కేలా..
మనె్నం జీవన వికాస హేలా..
మేడారం మహా జాతరకు
ఇంటిల్లిపాది ఇష్టంగా తరలుదాం
సమ్మక్క సారలమ్మల మొక్కు చెల్లించి
ఆ తల్లుల దీవెనలు అందుకుందాం
*
(నేడు సాగు మేడారం జాతరకు
అక్షరాభిషేకం చేస్తూ..)