క్రైమ్/లీగల్

ప్రజలను ఇబ్బందికి గురిచేయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ షహీన్‌బాగ్‌లో గత డిసెంబర్ 15వ తేదీ నుంచి జరుగుతున్న ఆందోళనలపై సుప్రీంకోర్టు స్పందించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా.. సూచించిన ప్రదేశంలో మాత్రమే ఆందోళనకారులు నిరసనలు తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. నిత్యం ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్.కౌల్, కేఎం జోసఫ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈమేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. షహీన్‌బాగ్‌లో సీఏఏను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న ఆందోళనకారులను తక్షణమే అక్కడి నుంచి తప్పించి.. రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రజలు పడుతున్న అవస్థలను పరిగణనలోకి తీసుకొని ఆమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తి మేరకు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ విచారణను ఈనెల 17వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ‘ఆందోళనలతో రోడ్లను స్తంభింప చేయకండి.. నిరవధికంగా ఆ ప్రాంతంలో ఆందోళన నిర్వహించడం వల్ల ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది.. మీరు ఆందోళన చేయాలనుకొంటే గుర్తించిన ప్రదేశంలో నిరసన తెలియజేసుకోండి’ అంటూ నిరసనకారులకు ధర్మాసనం సూచించింది. ‘మీరు ఆందోళన చేయవద్దని మేం అనడం లేదు.. ప్రజల అభ్యంతరాలు తెలియజేసేందుకు చట్టం ఉంది.. అది కూడా కోర్టు పరిధిలో విచారణ సాగుతోంది.. ఈ దృష్ట్యా మీరు రాకపోకలు సజావుగా సాగే ప్రదేశంలో మాత్రమే నిరసన తెలియజేయండి’ అని ఆందోళనకారులకు స్పష్టం చేసింది.
దీంతో పాటు నిరసన తెలియజేసేందుకు వీలుగా తక్షణమే ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని గుర్తించాలని ప్రభుత్వాలకు కోర్టు విజ్ఞప్తి చేసింది.