రాష్ట్రీయం

ఉపాధ్యాయ సంఘం నేత రామిరెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 2: మాజీ ఎంఎల్‌సి, యుటిఎఫ్ రాష్టమ్రాజీ అధ్యక్షుడు దాసూరి రామిరెడ్డి సోమవారం ఒంగోలులో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒంగోలులోని ఒకప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. రామిరెడ్డి భౌతికకాయాన్ని స్ధానిక యుటిఎఫ్ కార్యాలయంలో పలువురు సందర్శనార్ధం ఉంచారు. ఆయన భౌతికాయాన్ని పలువురు రాజకీయ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. మంగళవారం ఆయస స్వగ్రామమైన శింగరాయకొండ మండలం పాకల్లో అంత్యక్రియలు జరగనున్నాయి.
1938లోజన్మించిన ఆయన విద్యాభ్యాసాన్ని శింగరాయకొండ, కనిగిరి ప్రాంతాలత్లో పూర్తిచేశారు. 1964లో కడపకు చెందిన అనసూయమ్మను వివాహమాడారు. యుటిఎఫ్ వ్యవస్ధాపక అధ్యక్షుడిగా, 20సంవత్సరాలపాటు రాష్ట్ర అధ్యక్షుడిగా, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధానకార్యదర్శిగా, 1982-85లో మొదటిసారి, 2007-11 మధ్యలో రెండవసారి ఎంఎల్‌సిగా పనిచేశారు. 50 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేశారు. 44వ సంవత్సరంలోనే స్వచ్చంద ఉద్యోగ విరమణ చేశారు. జివోల రామిరెడ్డిగా ఆయనకు పేరుంది. మంచి ఉపాధ్యాయులే మంచి కార్యకర్తలని నిరంతరం చేప్పేవారు. బలమైన ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించారు. అన్ని సంఘాల ఐక్యవేదికగా ప్యాప్టోను నిర్మించి దానికి అధ్యక్షునిగా పనిచేశారు.

రామిరెడ్డి (ఫైల్ ఫొటో)