ఆంధ్రప్రదేశ్‌

రామదూతస్వామి ఆశ్రమంలో గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లూరు, మే 5: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో ఉన్న రామదూతస్వామిని కేంద్ర మంత్రి గడ్కరీ గురువారం సతీసమేతంగా దర్శించుకున్నారు. రామదూత ఆశ్రమంలో శ్రీ లక్ష్మీదాంపత్యవ్రత విరమణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖామంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర సహాయ మంత్రి సుజనాచౌదరి హాజరయ్యారు. రామదూతస్వామి నితిన్‌గడ్కరీ దంపతుల చేత స్వామివారికి గణపతిపూజ, కలశపూజ, వేణు దత్తాత్రేయస్వామి పాదపూజ, కుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ఎంపి రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణా రాష్ట్రం మేడ్చల్ ఎమ్మెల్యే సుబ్బిరెడ్డి, తెలంగాణా ఆర్యవైశ్య సంఘం నాయకులు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.