మెయన్ ఫీచర్

కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుల నెత్తికి బొప్పి కడితేనే వ్యవస్థలో లోపాలు బయటపడతాయి. ప్రజల ఈతి బాధలు తెలిసివస్తాయి. అయినా చేతుల్ని దులుపుకునే పాలకులు త పాలనకు తామే మురిసిపోతుంటారు. రాజ్యసభ సభ్యుడైన ఎంఎ ఖాన్‌కు హైదరాబాద్‌లోని ఓ పేరు మోసిన ఆసుపత్రి ముక్కుపిండి డబ్బులు కట్టమంటే కాని, కార్పొరేట్ వైద్యవిధాన ఘనత తెలిసిరాలేదు. ప్రభుత్వ వైద్యానికి బడ్జెట్‌లో కోట్లు మళ్లిస్తున్నామని పలికే నాయకులు, జబ్బుచేస్తే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి గడప నమ్మకంగా తొక్కరు. బ్యూరోక్రాట్లదీ ఇదే తీరు. ప్రభుత్వ నిబంధనల్ని తమకు అనుకూలంగా మార్చుకొని వైద్య ఖర్చుల పేరున కోట్లాది రూపాయలను కొల్లగొడుతూ, ప్రజల్ని మాత్రం నిరంతరం రోగగ్రస్తంగా మారుస్తున్నారు. వీరే అప్పుడప్పుడు ఆసుపత్రులను సందర్శించి హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలోని గిరిజన విద్యార్థులకు అంటువ్యాధిగా మారిన కడుపునొప్పికి స్థానిక వైద్యుడు అందించిన చికిత్స అపెండిసైటిస్ ఆపరేషన్. ఇలా అనైతికంగా చేసిన చికిత్సలు బయటకు పొక్కడం, ప్రభుత్వం కళ్లు తెరవడం, చర్యలు చేపట్టడం చర్విత చరణమే! ఇదే జిల్లా సుల్తానాబాద్ మండంలోని వెరోనికా అనే 7 నెలల పాపకు జ్వరం రాగా జిల్లా కేంద్ర ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా మూడు రోజులకు రూ.30 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా తగ్గకపోగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, బోన్ క్యాన్సరని చెప్పి రూ.4 లక్షలు గుంజారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో తిరిగి జిల్లాలోని గూడూరు ప్రైవేటు ఆసుపత్రిలో చూపిస్తే, అసలు బోన్ క్యాన్సరే లేదని తేలింది. నీలోఫర్ ఆసుపత్రి కూడా ఇదే నిర్ధారించింది. చివరకి నెల్లూరుకు తరలించబడిన ఈ పాప శరీరం అత్యధింగా మం దులు వాడటంతో చికిత్సకు సహకరించకపోవడంతో మూడు నెలల నరకయాతన తర్వాత చనిపోయింది. ఇలాంటి కథనాలు, కార్పొరేట్ ఆసుపత్రి దోపిడీ విధానాలు రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం.
వైద్యసేవల్ని అందించడంతలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నదని భావించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం చేసుకునే అవకాశాన్ని కలిగించింది. దీనికి కొన్ని ఆసుపత్రులకు రెఫర్ ఆసుపత్రులుగా గుర్తించడం జరిగింది. మొదట్లో హైదరాబాద్‌కే పరిమితమై వున్న ఈ ఆసుపత్రులు ఇప్పుడు 23 జిల్లాలకు విస్తరించాయి. ఇలా 600కు పైగా గల కార్పొరేట్ ఆసుపత్రులకు తోడు మరో 400కు పైగా ఆసుపత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. రాజకీయ అండతో కార్పొరేట్ లేబుళ్లు తగిలించుకున్న ఆసుపత్రులు అన్నీ గుర్తింపు పొందినవిగా ప్రచారం చేసుకుంటూ రోగులకు వలవేయడం ప్రారంభించాయి. వీటికితోడు వైఎస్‌ఆర్ కాలంలో వీటికి మరింతగా ప్రోత్సహించడానికై 108 సేవల్ని అందుబాటులోకి తెచ్చాడు. ఇలా ఆరోగ్యశ్రీ పథకం పేరున ఈయన హయాంలో చెల్లించినవి రూ.650 కోట్లకు పైమాటనే. ఈ డబ్బును ప్రభుత్వ ఆసుపత్రులపై ఖర్చు చేసినా ప్రజలందరికి కొంత మంచి వైద్యం అందుబాటులోకి వచ్చేది.
ఇలా దినదినాభివృద్ధి చెందిన ఈ కార్పొరేట్ వైద్యంలో అవసరమున్నా లేకున్నా రోగులకు ఖరీదైన అన్ని పరీక్షల్ని చేయించడం, శస్తచ్రికిత్స పేరున ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవడం, అత్యవసర చికిత్స పేరున, న్యూరోకేర్ పేరున రోజుకు రూ.3 వేలనుంచి రూ.40 వేలకు పైగా లాగడం మామూలైపోయింది. పేషెంటు కుటుంబ ఆర్థిక స్థితిగతుల్ని, స్థోమతను, చేసిన బీమా మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని లాగాల్సినంతగా లాగి చివరికి ఇంటికి పంపుతారు. ఈ మధ్యన హైదరాబాద్‌లో పేరుమోసిన ఓ ఆసుపత్రిలో గుండె చికిత్స పేరున, మెదడుకు సంబంధించిన వ్యాధి పేరున 80 రోజుల పాటు రోజుకు రూ.50వేల చొప్పున వసూలు చేసిన మొత్తం రూ.40 లక్షలు. ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు. దీనికి కారణం ఆ పేషెంటు ఆర్థికంగా బాగున్న వ్యాపారి కాగా, ఆయన చేసిన కోటి రూపాయల బీమా ప్రధాన కారణం. ఇలా లాగాల్సినంత లాగిన తర్వాత బయటకు పంపించిన ఈ పేషెంటు ఇంటికి రాగానే ప్రాణాలు వదిలాడు. దీనికి ముందు మరో ఆసుపత్రి పది రోజుల చికిత్సకోసం రూ.3 లక్షలు వసూలు చేసింది. ఇలాంటి పరిస్థితి అమెరికా లాంటి దేశాల్లో జరిగితే పెట్టిన ఖర్చుతో పాటు జరిమానా విధిస్తాయి. ఈ మధ్యన జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీ శరీర పౌడర్లు వాడినందుకు క్యాన్సర్‌కు గురైన ఇద్దరు యువకులకు ఒకరికి 72 మిలియన్ డాలర్లను, మరొకరికి 55 మిలియన్ డాలర్లను నష్టపరిహారం చెల్లించేలా స్థానిక కోర్టులు ఆదేశించడం గమనార్హం. మనదేశంలో ఇలాంటి వినియోగదారుల వ్యవస్థ లేకపోవడంతో ఈ కార్పొరేట్ సంస్కృతి ఆక్టోపస్‌లా విస్తరించింది. జలగల్లా పీల్చుకు తింటున్నాయి. వీటికి ప్రభుత్వ అండదండలు దండిగా వుంటున్నదనేది కాదనలేని సత్యం.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథక నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యశ్రీ నిధుల్లో సింహభాగాన్ని కాజేస్తున్న ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు నెలనెలా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది అక్షరాలా రూ.40 నుంచి రూ.50 కోట్లు! ఈ రూపాయల్ని ప్రణాళకా బద్ధంగా పది జిల్లా కేంద్ర ఆసుపత్రులపైన, ప్రతి ఏరియా సుపత్రిపైనా ఖర్చు చేస్తే ప్రజలందరికి, ఉద్యోగులతో సహా నాణ్యమైన ప్రభుత్వ వైద్యాన్ని అందించవచ్చు. సాధారణంగా వ్యక్తిగతంగా నడిచే ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్ ఫీజు రూ.100 నుంచి రూ.300 వరకు తీసుకుంటే, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తాయి. దీనికి రూ.500 నుంచి రూ.1000 వరకు రిజిస్ట్రేషన్ అదనం. ఇలా సాధారణ చెకప్‌కు ఒక రోగి చెల్లించేది రూ.2వేలు కాగా, పరీక్షలు, మందులు కలిసి రూ.10వేలు దాటుతాయి. రెండో డాక్టరు అభిప్రాయమంటూ ఇద్దరి ముగ్గురు డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజు మూడు నుంచి నాలుగువేల రూపాయలు వసూలు చేస్తారు. ఇలా సాధారణ చికిత్సకై వచ్చిన వారికి, ఫలానా సీరియస్ జబ్బులున్నాయంటూ, వెంటనే ఆసుపత్రిలో చేరాలంటూ ఒత్తిడి చేయడం జరుగుతుంది. ముఖ్యం గా గుండె సంబంధమైన సమస్యలు ఉంటే, 3ఇంతకాలం మీరు బతకడమే కష్టమని2 వెంటనే స్టెంట్ వేయించుకోవాలని లేకపోతే శస్తచ్రికిత్స చేయించుకోవాలని ఉపదేశించడం మామూలైపోయింది. ఇలా రాష్ట్రంలో వేయబడుతున్న స్టెంట్లు 15 శాతం అవసరమేనని, 40 శాతం మందికి మందులకు తగ్గినా స్టెంట్లు వేయడం పరిపాటిగా మారిందని కార్డియాలజిస్టు సొసైటీ స్వయంగా ఆరోపించింది. ఇలా ఇరు రాష్ట్రాల్లో 2014-15లో వేసిన స్టెంట్లు లక్ష కాగా, దేశవ్యాపితంగా వేసినవి 4.75 లక్షలు కావడం గమనించాలి.
అమెరికా లాంటి దేశంలో కార్డియాలజిస్టు బృందం కలిసి స్టెంటు వేయాలా వద్దా అని నిర్ణయిస్తే, ఇక్కడ వ్యక్తిగత స్థాయి లో డాక్టరు నిర్ణయించి స్టెంట్లు వేయడం పరిపాటని నిమ్స్ డాక్టర్ ఆర్‌వి కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనుమానం వచ్చిన కొందరు పేషంట్లు తెలిసిన మరో డాక్టరు దగ్గర సలహా తీసుకుంటే అసలు స్టెంటు అవసరం లేదన్న సందర్భాలు వున్నాయి. నిజానికి 60 నుంచి70 శాతం పేషెంట్లకు అత్యవసరమంటూ ఉండదని, వారి ఆతృతను, ఆర్థిక స్థోమతను గుర్తించి కార్పొరేట్ వైద్యశాలలు సొమ్ము చేసుకోవడం జరుగుతున్నదని, విలువలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన డా.ఇ. గౌతంరెడ్డి చెప్పింది అక్షరసత్యం. హైటెక్ సిటీ ప్రాంతంలో బీదవారికోసం వైద్యశాలను నడుపుతున్న డాక్టర్. ఆర్. సుకుమార్ మాట్లాడుతూ, కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యుడి ఆలోచనలకు భిన్నంగా, యాజమాన్యం ఆదేశాలే చలామణి అవుతాయని, ఈ సందర్భంగా అనడం జరిగింది. ఈ ఆసుపత్రులు ఏవీ కూడా 200 నాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన ఎథికల్ కోడ్‌న పాటించరని, అధ్యాయం-4 ప్రకారం వివిధ చికిత్సలకై వసూలు చేసే రుసుములను బహిరంగంగా ప్రకటించాలని వున్నా ఎవరూ పాటించరని స్వయంగా హైదరాబాద్ ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు వాపోయారు.
దేశవ్యాప్తంగా 78 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల్ని ఇం టర్వ్యూ చేసి రాసిన డిసెంటింగ్ డయాగ్నసిస్ అనే పుస్తకంలో దేశస్థాయి వైద్యమంతా అవినీతి, అనైతికమేనని డాక్టర్ అరుణ్ గాడ్రి, డాక్టర్. అభయ్ శుక్లాలు తెలిపారంటే, వైద్యమెట్లా వ్యాపారమైందో తెలుస్తున్నది. చివరికి 70-80 సంవత్సరాల వయసు వారిని కూడా డబ్బుల్ని గుంజడానికి వెంటిలేటర్‌పై పెట్టడం మామూలైపోయిందని, మెజారిటీ ఆసుపత్రులను డాక్టర్లు కానివారే నడుపుతున్నారని ఈ పుస్తకంలోప్రస్తావించారు. ఇలా సాధారణంగా రూ.50లకే చేసే ఈసిజీ ఈ ఆసుపత్రులు రూ.300 చార్చి చేస్తుంటే, రూ.160కి జరిగే థైరాయిడ్ పరీక్షకు రూ.1040 వసూలు చేస్తుంటే వీరి దోపిడి ఇంకెట్లా ఉంటుందో ఊహించవచ్చు.
ఇక ఈ మధ్యన డెంటల్ ఆసుపత్రుల దోపిడీకైతే అంతేలేకుండా పోయింది. ఒకపన్ను ఊగితే మొత్తం పళ్లే ఊడుతాయని భయపెట్టి వేలాది రూపాయలను గుంజడం జరుగుతోంది.
ఇలా వ్యాపారంగా మారిపోయిన కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రించకపోతే 3వైద్యో నారాయణో హరి..2అనే దానికి అర్థమే మారిపోతుంది. ఇప్పటికే దీని లక్ష్యం పూర్తిగా మారిపోయింది. కంటి చికిత్సకు పోతే తుంటి చికిత్స చేసే ఈ వైద్యవిధానాన్ని ప్రజలే సంఘటితంగా వ్యతిరేకించాలి. ప్రభుత్వంపై వత్తిడి పెంచి ప్రభుత్వ వైదాయన్ని బలోపేతం చేయాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుంది.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162