క్రిస్మస్‌కు నాన్నకు ప్రేమతో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 20తో అక్కడ షూటింగ్ పూర్తిచేసుకుందట. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుగుతున్నాయట. మరోవైపు ఆడియో విడుదల కోసం భారీగా సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలని ఈనెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారట. సినిమా కూడా జనవరిలో విడుదలకు ప్లాన్ చేశారు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.