సబ్ ఫీచర్

కడుపు మాడుస్తున్న ‘సామాజిక’ వ్యసనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లతో గంటల కొద్దీ కాలక్షేపం చేస్తున్న యువతలో చాలామంది కడుపునిండా తినడానికి కూడా నోచుకోవడం లేదని తాజా అధ్యయనం లో వెల్లడైంది. సోషల్ మీడియాతో మమేకమైపోతున్న టీనేజర్లలో అపసవ్యపు ఆహార అలవాట్లు చోటు చేసుకుంటున్నట్లు అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. సరైన వేళకు సరైన తిండి లేకపోవడంతో మంచి శరీరాకృతిని కోల్పోతూ చాలామంది యువతీ యువకులు అనారోగ్యాలతో సహవాసం చేస్తున్నారు. ఫ్యాషన్ మ్యాగజైన్లు, టీవీకి బానిసలయ్యేవారిలో ఒకప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించేవని, ఇపుడు సోషల్ మీడియా పుణ్యమాని యువతలో మంచి ఆహారపు అలవాట్లు గగనమైపోతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యయనం సందర్భంగా 19 నుంచి 32 ఏళ్లలోపు వయసున్న 1,765 మంది ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరికి 11 సామాజిక వెబ్‌సైట్ల విషయమై అనేక ప్రశ్నలు అడిగారు. ఆహారపు అలవాట్లకు సంబంధించి కూడా సమాచారం రాబట్టారు. సోషల్ మీడియాతోనే తమకు రోజంతా గడచిపోతోందని చాలామంది సర్వేలో తెలిపారు. వేళకు తినకపోవడం, ఒక్కోసారి ఏమీ తినక కడుపు కాల్చుకోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో పాటు నరాలకు సంబంధించిన వ్యాధులు, మానసిక సమస్యలు సైతం అనేకమందిలో బయటపడ్డాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ జైమీ సిదానీ చెబుతున్నారు. అనేక అనారోగ్యాలకు గతితప్పిన ఆహారపు అలవాట్లే కారణమని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో తక్కువ సమయం గడిపేవారిలో ఇలాంటి అవలక్షణాలు కనిపించలేదు. వెబ్‌సైట్లకు అతిగా అతుక్కుపోయేవారు ముందుముందు రోగాల బారిన పడడం ఖాయమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సామాజిక వెబ్‌సైట్ల వల్ల ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని అధ్యయనంలో తేటతెల్లమైంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు జాగ్రత్త వహిస్తూ వెబ్‌సైట్లకు దాసోహమవుతున్న టీనేజర్లను గాడిలో పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు.