రాష్ట్రీయం

రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రతి జిల్లాకు రూ.30 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: రాష్ట్ర ఆవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి జిల్లాకు రూ. 30 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వెల్లడించారు. సచివాలయం నుంచి శుక్రవారం వివిధ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గ్రామస్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఘనంగా, పండుగ వాతావరణంలో జరగాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్ యార్డులు, సొసైటీలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. అలాగే బంగారు తెలంగాణ సాధనపై సభలు, సదస్సులు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను విద్యుదీకరించాలని రాజీవ్ శర్మ సూచించారు. రాష్టవ్య్రాప్తంగా రక్తదాన శిబిరాలు, ఆసుపత్రులలో పండ్ల పంపిణీ , కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ప్రత్యేక రన్‌లు, గత రెండేళ్లుగా ప్రభుత్వం సాధించిన విజయాలపై బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ఆవతరణ వేడుకలు ప్రారంభమయ్యే తొలి రోజు మొదట అన్ని జిల్లాల్లో అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు ఆర్పించిన అనంతరం జాతీయ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమాలు జరగాలన్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల సందర్భంగా వివిధ రంగాలలో నైపుణ్యం కనబర్చిన 25 మందికి అవార్డులు అందజేసి సత్కరించడం, ప్రత్యేక డాగ్, హార్స్ షోలు నిర్వహించాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా వారం రోజుల పాటు గ్రామ పంచాయతీలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమాలపై ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంటరీలు తయారు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఐకెపి గ్రూపులు, స్వచ్ఛంద సంస్థలు, క్రీడా సంఘాలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో పాటు అమరవీరుల కుటుంబాలు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని రాజీవ్‌శర్మ సూచించారు. రాష్ట్ర శ్రేయస్సును కోరుతూ మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్లు, దీపం కనెక్షన్లు, ఎన్‌ఆర్‌జిజిఎస్ వేతనాల చెల్లింపు, వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఆస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జూన్ 2వ తేదీన హెచ్‌ఐసిసిలో రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి కనీసం 100 మంది ప్రముఖులకు ఎస్కార్ట్ కల్పించి హైదరాబాద్‌కు పంపించాలని రాజీవ్‌శర్మ ఆదేశించారు.

రాష్ట్రం, జిల్లాల వారీగా చేపట్టే కార్యక్రమాలపై పంపించే నివేదికలపై ఈ నెల 26న మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై సమీక్షిస్తుందని రాజీవ్ శర్మ చెప్పారు.