సబ్ ఫీచర్

మన న్యాయవ్యవస్థ - ఒక అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిక్కమైన న్యాయవ్యవస్థ జగతికి ప్రాణవాయువు. అచ్చమైన న్యాయ వ్యవస్థ ప్రగతికి జీవధాతువు’’ అన్నారు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలీ యస్.నారిమన్. కాని నేటి పరిస్థితిని గూర్చి"Apart from pendency and delayed justice, corruption is another challenge we face both in government and the judiciary'' (ఫ్రభుత్వము, న్యాయవ్యవస్థ అవినీతి సవాలును ఎదుర్కొంటున్నాము) అని 19-4-2008న ముఖ్యమంత్రు లు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల కాన్ఫరెన్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్, మన దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఒకే వేదికపై సహోపన్యాసకులుగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కుండబద్దలు కొట్టిన నిజం. అదే రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన పదవి సమాచార హక్కు చట్టంలోకి రాదు అని చెప్పి తాను ప్రజల దృష్టినుంచి దూరంగా జరిగిపోయారు.
ఒకప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఆనం ద్ ‘‘మనింటిని మనం శుభ్రం చేసుకుందాం’’ అన్నారు. ప్రధాన న్యాయమూర్తి యస్.పి. బరూచగారు ‘‘80 శాతం న్యాయమూర్తులు నిజాయితీపరులని’’ వాస్తవాన్ని పరోక్ష రీతిలో 20 సంవత్సరాల క్రితమే చెప్పారు. వారు, వారి వారి వ్యవస్థలలో దేశానికి పెద్దలు. కనుక న్యాయవ్యవస్థ దుర్దశను గూర్చి దేశం యావత్తు చర్చించుకుంటున్న అంశమేనని గ్రహించగలం. ఈ విషయాలపై ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు ఎ.జి. నూరాని కూడ ‘‘అవినీతి నేరానికి శిక్ష సంఘానికి రక్ష’’ అన్నారు. అప్పటికే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.కె.సబర్వాల్‌పై అవినీతి ఆరోపణ, దానిపై నలుగుర మిడ్‌డే పత్రికా విలేకరులపై కోర్ట్ధుక్కార నేరం కేసులో శిక్షలు, వాస్తవాన్ని రుజువుచేసే హక్కు, అవకాశం తమకున్నవని ఆ విలేకరులు వాదన, న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం పారదర్శకతను కోరడం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నది. దీనితో న్యాయమూర్తుల అవినీతిని ప్రశ్నించలేమా? సత్యశోధన అవసరం లేదా? అందుకు ప్రజలకు హక్కు లేదా? వ్యవస్థను అగ్నిశుద్ధి చేయలేమా, అన్న ప్రశ్నలు ప్రజలే సంధించినపుడు అంగీకారయోగ్యమైన జవాబును న్యాయవ్యవస్థ ప్రజలకివ్వలేకపోయింది. ప్రముఖ న్యాయశాస్తవ్రేత్త జస్టిస్ వి.ఆర్.క్రిష్ణ అయ్యర్ ఒక వ్యాసంలో "To criticise judge fairly albeit fiercely is no crime but a necessary right'' అన్నారు. సధ్విమర్శ కటువుగా వున్నా నేరం కాదని, అది ప్రజల అవసర హక్కని చెప్పా రు. ఇలాగే దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎ.యస్.ఆనంద్, ఎం.ఎం. పూంచ్‌లపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి పైన అవినీతి ఆరోపణలు రాగా, సమర్ధవంతంగా చర్యలు తీసుకోగలిగిన యంత్రాంగం లేక అభిశంసనలు రాజకీయ రంగు పులుముకొని ముగిశాయి. జాతీయ జ్యుడిషియల్ కమిషన్ (ఎన్.జె.సి) ఏర్పాటు ఆలోచన అప్పుడు వచ్చిందే.
ఈ అవినీతిపై విచారణకు, నిజ నిర్ధారణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఆమాటకొస్తే అందరు న్యాయమూర్తులు ఏకంగా న్యాయ వ్యవస్థ యావత్తు వ్యతిరేకులైనారన్న భావం ప్రజల్లోకి బలంగా వచ్చింది. ఘజియాబాద్ ఉద్యోగ భవిష్యనిధి కుంభకోణం కేసులో కొంతమంది న్యాయమూర్తులే భాగస్వాములని అభియోగం వచ్చింది. ‘‘అవినీతిపరులైన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు అండ గా నిలుస్తోందని’’ శాంతిభూషణ్- న్యాయవాది పూర్వన్యాయశాఖా మంత్రి కోర్టులో వాదించినపుడు జస్టిస్ అగర్వాల్ విచారణ నుండి తప్పుకున్నారు. అంతకుముందు చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ తప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 36 మంది అవినీతి న్యాయమూర్తుల పేర్ల జాబితాను సీల్డ్‌కవర్లో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం పంపింది. జస్టిస్ సౌమిత్రాసేన్, జస్టిస్ నిర్మల్ యాదవ్, నిర్మల్ జిత్ కౌర్, జె.యస్.వర్మ సేన్, జస్టిస్ దినకరన్ వగైరాలపై కూడ అవినీతి ఆరోపణలు నిగ్గుతేలకుండా పోయాయి. నిన్న- నేటి గాలి జనార్దనరెడ్డి కేసులో న్యాయమూర్తుల తీరు విచారణలో వున్నది. తీరా క్షేత్రస్థాయిలో సమాచారం పోగుచేస్తే 30 నుండి 50 శాతం వరకు న్యాయమూర్తులు కళంకితంగా ఉన్నారని న్యాయవ్యవస్థే అంగీకరించిన సత్యం. ప్రశ్నించిన వారిపై కోర్టు ధిక్కార నేరం ఉచ్చు బిగుస్తుంది. నీవు ఎంత ఎత్తునవున్నా న్యాయం ఇంకా ఎతె్తైనదన్న ప్రశ్న ప్రజల్నుండి వస్తుంది. లాటిన్ అమెరికాలోను, ఐరోపా దేశాలలోను కోర్టు ధిక్కార నేరం చట్టం లేదు. న్యాయమూర్తులపై విమర్శ దోషం కాదని లార్డ్ డెన్నింగ్ అభిప్రాయం. జస్టిస్ వి.ఆరు.క్రిష్ణఅయ్యర్ "Judges generally maintain high standards. Even so, the number of delinquents is on the rise, Bribery, sexism, communalism, corruption, vanity, arbitrariness and like vices are no longer uncommon''అన్న నిజాన్ని నిర్ద్వంధ్వంగా చెప్పారు. ప్రముఖ న్యాయవాది ఫాలి.యస్.నారిమన్’’ తీర్పుల కర్మాగారానికి అతిసార వ్యాధి పట్టుకున్న’’ద న్నారు. దేశ ప్రజల సద్విమర్శలను న్యాయ వ్యవస్థ కోర్టు ధిక్కార చట్టం అడ్డుపెట్టి ఎప్పుడైతే దూరం చేసిందో అప్పుడే అచేతనమై సామాజిక మానవీయ స్పృహను కోల్పోయింది. అందుకే అరుంధతీరాయ్ కోర్ట్ధుక్కారం కేసులో ఒక రోజు శిక్ష విధించి సుప్రీంకోర్టు పొరబడిందని ప్రముఖ న్యాయవాది ఫాలి.యస్.నారిమన్ వ్యాఖ్యానించారు. అలహాబాదు హైకోర్టుపై సుప్రీంకోర్టు (జస్టిస్ మార్కండేయ కడ్జూ, జస్టిస్ గ్యాన్ సుధామిశ్రాల బెంచి) తీవ్ర విమర్శలు చేసింది. ఇక్కడ వ్యవస్థ కుళ్ళిపోయిందని ‘‘అంకుల్ జడ్జి సిండ్రోం’’ విస్తరించిందని వ్యాఖ్యానించింది. "To gag all expressions of disapproval of judicial delinquency is to guillotine free speech which is a fundamentl right'' అని జస్టిస్ వి.ఆర్.క్రిష్ణ అయ్యర్ అన్నారు.
ఇధంతా పెద్దల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. బలమైనదే. కాదనలేనిదే. ఇదంతా ఒక పార్శ్వం. అయితే న్యాయస్థానాలు తమ కు తాముగా కల్పించుకొని కూడ ప్రజల పక్షాన నిలిచి, ప్రభుత్వాలను నిలదీసి, ప్రభుత్వాలలోని వ్యక్తులను నిలదీసి నడివీధుల్లో పరచి వారిని ప్రజల సమక్షంలో ముద్దాయిలుగా నిలబెట్టిన సందర్భాలు లేకపోలేదు. సహారాస్కామ్, బొగ్గు, గడ్డి, ఇనుము, 2జి, అగ్రిగోల్డ్, పెరల్స్ వగైరాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికి వెలుగులోకి వచ్చిన చాలా స్కాములు న్యాయస్థానాలలో ఏ కొందరో న్యాయమూర్తులు అనుసరించిన పవిత్ర భావనల వలన, ప్రజాసంక్షేమానికి న్యాయానికి కట్టుబడినందువలననేనని చెప్పాలి.. అట్టి న్యాయమూర్తులకు దేశం కైమోడ్పులు చెల్లించవలసిందే.

- బి.హనుమారెడ్డి