డైలీ సీరియల్

యమహాపురి 56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే మనిషిని మనిషి కాదనే ఇక్కడి సంస్కృతిని జీర్ణించుకోలేకపోతున్నాను’’ అన్నాడు మాతతో.
మాత నవ్వింది. ‘‘నీ నేపథ్యం నిజంగా నికృష్టమే. కానీ మా ఊరి జనం జీవితం ఇంకా నికృష్టం అని నువ్వనుకోవడం సరికాదు. ఎందుకంటే..’’ అని ఆగి, ‘‘నీకు నీ మేనత్త నచ్చలేదు. ఆ ఇంట్లో జీవితం నచ్చలేదు. కానీ ఆ జీవితం నుంచి పారిపోయే స్వేచ్ఛ నీకుంది. బ్రతకడానికి బయట సవాలక్ష మార్గాలున్నాయి. కావాలంటే మూటలు మొయ్యుచ్చు. అడుక్కుతినొచ్చు. ఔనా?’’ అంది.
రాజా తల అడ్డంగా ఊపి, ‘‘ఆ పని చేసేవాణ్ణే! కానీ మా అమ్మ నాకు దేవత. తన మాట కాదనలేను. అత్తయ్యని ఎదిరించినా, కాదన్నా అమ్మ బాధపడుతుంది. అమ్మకోసం నాకిష్టం లేకపోయినా అత్తయ్యింట్లో ఉండిపోవాల్సి వచ్చింది’’ అన్నాడు.
‘‘మరి మా టామీని చూడు. దానికి మేమంటే భక్తి, గౌరవం. ఏం చెబితే అది ఇష్టంగా చేస్తుంది. ఏం చేసినా సంతోషంగా ఉంటుంది. ఆ విషయం నువ్వు ప్రత్యక్షంగా చూశావు. నికృష్ట జీవితం నీ గతానిదా, మా టామీదా’’ అంది మాత.
ఆ మాట రాజాని ముల్లయి గుచ్చింది. ఇలా ఆలోచించలేదు తనెప్పుడూ.
మాత మాటలో ఎంతో కొంత తర్కముంది. నిజంగా తన జీవితం టామీకంటే నికృష్ణమైనదా?
అతడి ఆలోచనలు చదువుతున్నదానిలా, ‘‘నీ జీవితం నిష్కృతమైనదే. దాన్నించి బయటపడ్డానికే జగదానందస్వామి నీకు దీవెన అందించాడు. ఆ దీవెనతో నువ్విక్కడికి రాగలిగావు. ఇంతవరకూ మా గ్రామస్తులు కానివార్వెవరూ నీ అంత సులభంగా మా ఊళ్ళోకి రాలేదు. తెలుసా?’’ అంది మాత.
రాజాకి ఏమనాలో తెలియలేదు. తానిప్పుడు పద్మవ్యూహానికి మించిన ఓ మహాభయంకర వ్యూహంలో అడుగెట్టాడు. అభిమన్యుడైతే కొంచెంసేపైనా నిలబడి పోరాడగలిగాడు కానీ- తనప్పుడే బెంబేలు పడిపోతున్నాడు. చూసిన దృశ్యాలు, మాత విశే్లషణ అతణ్ణి ఆపాదమస్తకం వణికిస్తున్నాయి.
మాటలతో తనని భయపెడుతున్న మాత మాటలకి ఎలాగో అలా బ్రేకులు వెయ్యకపోతే ఈ క్షణంలోనే తన పని అయిపోవచ్చు.
‘‘స్వామీ! నీ దీవెన నన్నిక్కడికి రప్పిస్తే- నన్ను కాపాడుకునే బాధ్యత కూడా నీదే!’’ అనుకున్నాడు రాజా మనసులో. మాతతో, ‘‘నాకు జగదానందస్వామి దీవెన లభించి ఉండొచ్చు. కానీ నన్నీ ఊరు రప్పించింది మాత్రం మీవారు యమ’’ అన్నాడు.
అది హెచ్చరికలా ధ్వనించకూడదని యత్నించాడు కానీ మాట కాస్త కటువుగానే వచ్చింది.
‘‘టామీ- మంచినీళ్ళు’’ అంది మాత గట్టిగా. తర్వాత రాజావైపు తిరిగి, ‘‘నిన్నీ ఊరు రప్పించింది మావారే. కానీ నీకు మావారి గురించి పూర్తిగా తెలియదు. ఆయన వివరాలు నీకు మింగుడు పడాలంటే- ముందు నువ్వు ఈ నరకపురి బయట నువ్వుందనుకుంటున్న స్వేచ్ఛా ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. నిజానికది స్వేచ్ఛా ప్రపంచం కాదు. మహానికృష్ట ప్రపంచం. టామీ జీవితం నీ జీవితకంటే నికృష్టమని పొరబడలేదూ- అలాగే ఆ ప్రపంచం విషయంలోనూ నువ్వు పొరబడ్డావు’’ అంది.
ఆమె చెబుతుంటే రాజా విన్నాడు.
బయట ప్రపంచంలో ప్రతి పౌరుడికీ ఓటు హక్కుంది. ప్రజలు తమకి సుఖ సంతోషాన్నివ్వగల మంచి నాయకుణ్ణి ఎన్నుకునేందుకు సహకరించే ఆ ఓటు ఎంతో విలువైనది. కొందరా ఓటుని ఒక్క రోజుకి లభించే గుక్కెడు సారాకో, గుప్పెడు పైసలకో అమ్ముకుంటారు. కొందరా ఓటుని తమకి అన్యాయం చేసినా సరే తమ కులం వాడికో, మతంవాడికో, వర్గం వాడికో వేస్తారు. కొందరు మేధావులమనుకుంటూ- అభివృద్ధి సాధించేవాడిపై నేరస్థుడన్న ముద్ర వేసి పక్కన పెడతారు. కొందరు సమదృష్టికి తప్పుడు నిర్వచనమిచ్చి- దేశాన్ని దోచుకుంటున్న అవినీతిపరులకు పట్టం కడతారు. ఫలితంగా దేశంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు, నేరాలు మితిమీరి పేదరికం ప్రబలిపోతుంటే వౌనంగా భరిస్తారు తప్ప ఎదురు తిరగాలనుకోరు. పౌరుల్లో ఎవరిని కదిపినా అంతులేని అసంతృప్తి బయటపడుతుంది.
‘‘మరి మా నరకపురి చూడు. ఇక్కడి పౌరులకు మావారు దేవుడు. ఆయన మాట జనాలకి వేదవాక్కు. ఆయన ఆదరించినా, శిక్షించినా ఒకే విధంగా సంతోషిస్తారు. ఎవరిని కదిపినా అసంతృప్తి అన్నమాటే వినిపించదు. బయటి ప్రపంచంలో స్వేచ్ఛకంటే ఇక్కడ మావారికి బానిసలుగా ఉండడానికే వాళ్లు ఇష్టపడతారు. ఇప్పుడు చెప్పు- బయటి ప్రపంచం గొప్పదా? మా ఊరు గొప్పదా?’’ అంది మాత.
అంతా విని, ‘‘ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను. ఎందుకోగానీ మీ ఊరిమీద మీకే అసంతృప్తి ఉంది. అందుకే ఇక్కడి వ్యవస్థని సమర్థించుకుందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నాడు రాజా.
మాత ఏదో చెప్పబోయింది. అంతలో టామీ చేతిలో ట్రేలో మంచినీళ్ల గ్లాసులతో అక్కడికి వచ్చింది. మాత ఓ గ్లాసు తీసుకుంది. ఆమె సైగని అర్థం చేసుకుని ఆమె రాజా దగ్గిరకు వెళ్లింది. తనకి వద్దన్నట్లు సైగ చేశాడతడు. మాత నీళ్లు తాగేక గ్లాసు తీసుకుని వెళ్లిపోయింది టామీ. అప్పుడు మాత సాలోచనగా, ‘‘ఏమో- నాలో నువ్వన్న అసంతృప్తి ఉన్నా ఉండొచ్చు. ఎందుకంటే నేనిక్కడ ఈ ఇంట్లో మహారాజ వైభోగాలు అనుభవిస్తున్నాను. కానీ ఈ ఊళ్ళో మనుషులంతా తాము చేసిన పాపాలకు మా వారి చేతిలో శిక్ష అనుభవిస్తూ, మావారికి బానిసలుగా ఉంటూ, మనుషులు అనిపించుకోలేని దశలో ఉన్నారు. అందుకు వాళ్లకి అసంతృప్తి లేకపోవచ్చు. కానీ నాకు తెలియకుండా నా మనుసలో కొంత అసంతృప్తి ఏర్పడిందేమో చెప్పలేను’’ అంది.
‘‘మీకు తెలియకుండా మీ మనసులో కొంత అసంతృప్తి ఉండొచ్చన్నారు. మరి మీకు తెలియకుండా మీ ఊళ్ళో కూడా కొంత అసంతృప్తి ఉండొచ్చుగా’’ అన్నాడు రాజా.
‘‘ఉండదనే నా నమ్మకం. ఎందుకంటే వాళ్లందరికీ మావారు దేవుడు. వాళ్లంతా ఆ దేవుణ్ణి నమ్మారు. దేవుణ్ణి నమ్మినవారికి అసంతృప్తి ఉండదు. వాళ్ళెప్పుడూ సంతోషంగానే ఉంటారు. టామీని చూశావుగా...’’ అంది మాత.
‘‘నేను ఊళ్ళో మనుషుల గురించి మాట్లాడుతున్నాను. టామీ మనిషి కాదని మీరన్నారు’’’

ఇంకా ఉంది

వసుంధర