ఫోకస్

పాలన పట్టాలెక్కిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయి ఏడాది గడిచింది. రెండు రాష్ట్రాల పరిస్థితి వేరు. రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు. ఒక రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం గల చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అనుభవం లేని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం రెండు రాష్ట్రాల గురించి ప్రచారంలో, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు వేరు... ఏడాది పాలనలో చూసింది వేరు. పాలనాపరంగా ఇద్దరూ బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంలో పాలనను గాడిలో పెట్టడానికే ఇద్దరు ముఖ్యమంత్రులూ ఎక్కువ సమయం కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నడుం బిగించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ పరిచేందుకు రెండు ప్రభుత్వాలూ సరికొత్త పారిశ్రామిక విధానాలకు తెరతీశాయి. ఇందులో భాగంగా వేల కోట్ల రూపాయల విలువైన పథకాలకు శ్రీకారం చుట్టారు. వౌలిక సదుపాయాల కల్పన, విద్యుదుత్పత్తివంటి రంగాల్లో స్వావలంబన సాధన రెండు రాష్ట్రాలకూ ఓ పెద్ద సవాల్. గుండెకాయలాంటి హైదరాబాద్ సహా పది జిల్లాల్లోనూ అభివృద్ధిని పట్టాలపైకి ఎక్కించేందుకు కెసిఆర్ తాపత్రయపడుతున్నారు. మరోవైపు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో బాలారిష్టాలను అధిగమించడంలో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేక హోదా సాధన కూడా ఆయనకు విషమ పరీక్షలా మారింది. అభివృద్ధితోపాటు రాజకీయాలకూ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. విపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు, పార్టీ బలం పెంచుకునేందుకు వీలైనంత సమయం కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకోవడానికి ఏ విధమైన ఆస్కారమూ లేదు. కానీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది. దాంతో రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణాత్మక వైఖరి చోటు చేసుకుంటోంది. అయితే ఏడాది కాలం గడిచింది కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులకూ హనీమూన్ కాలం ముగిసిపోయినట్టే. ఈ ఏడాది పాలనలో ఎవరేం సాధించారన్నది బేరీజు వేసుకోవాల్సిన సమయమిది. ‘అభివృద్ధిలో పోటీ పడదాం’ అని చంద్రబాబు ఓ సందర్భంలో కెసిఆర్‌కు సవాల్ విసిరిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ఈ నేపథ్యంలో ఏడాది పాలనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాధించిందేమిటనే అంశంపై ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.