రాష్ట్రీయం

ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 4: కెజి బేసిన్ పరిధిలో రూ.30వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఎన్‌డియే రెండేళ్ల పాలన నేపథ్యంలో బిజెపి చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించేందుకు కేంద్ర మంత్రులు చేపట్టిన పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన మంత్రి ధరేంద్ర ప్రధాన్ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కెజి బేసిన్ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. విశాఖలో హెచ్‌పిసిఎల్ పెట్రో కాంప్లెక్సును రూ.20వేల కోట్లతో విస్తరిస్తున్నామని చెప్పారు. 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కాంప్లెక్సును 15 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. రూ.30 వేల కోట్లతో కొత్తగా పెట్రో కాంప్లెక్సును ఏర్పాటుచేస్తున్నామని, స్థల పరిశీలన జరుగుతోందన్నారు. కాకినాడలో ఎల్‌ఎన్‌జి ప్లాంటు 2019 లోగా పూర్తిచేయనున్నట్టు తెలిపారు. కెజి బేసిన్‌లో ఒఎన్జీసీ లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. మరో లక్ష కోట్లకు పైబడి వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. మచిలీపట్నం నుండి విశాఖ వరకూ ఆ ప్రాంతం ఆయిల్ కేపిటల్‌గా రూపాంతరం చెందనుందని, ఈ ప్రాంతంలో పెట్రో ఎకనమిక్ జోన్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. విభజన అనంతరం రాష్ట్రానికి రెండు ప్రధాన సమస్యలు వచ్చాయని, అందులో ఒకటి పెట్రో యూనివర్సిటీ కాగా, మరొకటి పెట్రో కాంప్లెక్సు అని మంత్రి వివరించారు. పెట్రో యూనివర్సిటీని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో వచ్చే విద్యాసంవత్సరం నుండి తరగతులు ప్రారంభిస్తున్నామని, ఇందులో
ప్రవేశానికి ఖరగ్‌పూర్‌లోని ఐఐటి ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. కెజి బేసిన్ అపార నిక్షేపాల గనిగా ఉందని, అయితే అత్యంత సంక్లిష్టమైన ఈ భూగర్భంలో 480 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిక్షేపాలను వెలికితీస్తున్నట్టు మంత్రి చెప్పారు. కెజి బేసిన్ ఆయిల్ కేపిటల్‌గా వివిధ పెట్రో పరిశ్రమలకు వౌలికపరంగా విస్తరిస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు మార్కెట్ విధానాలపై ఆధారపడి ఉంటాయని, తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని చెప్పారు. అంతకుముందు ఒఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో కెజి బేసిన్ కార్యకలాపాలపై మంత్రి సమీక్షించారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మోదీ రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంట కేంద్ర పారిశుద్ధ్యం, తాగునీరు శాఖ సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్, బిజెపి కిసాన్ మోర్చ జాతీయ అధ్యక్షుడు విజయ్‌పాల్‌సింగ్ తోమర్, రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, మాజీ ఎంపి కావూరి సాంబశివరావు, ఎపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ తదితరులున్నారు.

చిత్రం రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్. చిత్రంలో కేంద్ర సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ తదితరులున్నారు