ఆంధ్రప్రదేశ్‌

సర్వే బృందాలకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగాపురంలో మళ్లీ అడ్డుకున్న రైతులు.. పలువురు అరెస్టు

విజయనగరం, డిసెంబర్ 10: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం అవసరమైన భూములను సర్వే చేసేందుకు వెళ్లిన రైట్స్ సంస్థ బృందాలను గురువారం రైతులు, మహిళలు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ముందుజాగ్రత్తగా జిల్లా యంత్రాంగం అప్పటికే భారీఎత్తున పోలీసు బలగాలను మొహరింపచేయటంతో ఆందోళనకు దిగిన రైతులను, మహిళలను పోలీసులు అరెస్ట్‌చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసి సంఘటన ప్రాంతానికి వచ్చిన వామపక్ష పార్టీల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. మండలం గూడెపువలస గ్రామంలో పోలీసు పహారాతో ఉదయం ప్రారంభించిన సర్వేను సాయంత్రానికి రైట్స్ సర్వే బృందాలు పూర్తిచేసాయి. ఇదే గ్రామంలో మంగళవారం సర్వే కోసం వచ్చిన రైట్స్ సంస్థ బృందాలను రైతులు, మహిళలు అడ్డుకుని ఘెరావ్ చేయటం, పోలీసులు కొందరు రైతులను అరెస్ట్ చేయగా, గ్రామస్తులు ఎస్‌బి, ఇంటెలిజెన్స్ సిబ్బందిని నిర్బంధించటం వంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకరోజు విరామం అనంతరం గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే అధికారులు తమ బృందాలతో గూడెపువలస చేరుకుని సర్వే ప్రారంభించారు. విషయం తెలిసి రైతులు, మహిళలు సర్వే బృందాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని నివారించారు. ఈ సందర్భంగా సర్వే బృందం అధికారులు, పోలీసులతో రైతులు, మహిళలు వాగ్వివాదానికి దిగారు. 15మంది రైతులను, 35మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రైతులు, మహిళల అరెస్ట్ విషయం తెలిసి జిల్లా కేంద్రం నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు గూడెపువలసకు వెళ్లగా, పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్ట్ చేసి భోగాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వర్‌రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ ఉన్నారు.