రాష్ట్రీయం

ఫిరాయంపులు ఆపలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణాలో కాంగ్రెస్ నేతల తీరుపై అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోతుంటే టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారా? అని అధినేత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గ్రూపులను కంట్రోలు చేయలేకపోతున్నారని, ఎమ్మెల్యేల ఫిరాయింపులనూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిలువరించలేకపోతున్నారని అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీలో నాయకులు పరస్పరం కలహించుకోవటం, మరోవైపు ముఖ్య నేతలు పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరటాన్ని సోనియా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌కు వెళ్ళి టి.పిసిసి నేత ఉత్తమ్‌తో, మిగతా నాయకులతో చర్చించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. దిగ్విజయ్ సింగ్ ఈ నెల 15న హైదరాబాద్‌కు రానున్నారు. అదే రోజున టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం గాంధీ భవన్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో దిగ్విజయ్‌సింగ్ పాల్గొంటారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చించి అధిష్ఠానానికి నివేదిక సమర్పిస్తారు.
టి.పిసిసి నాయకులు, మాజీ ఎంపి జి. వివేక్, మాజీ మంత్రి జి. వినోద్ ఈ నెల 15న టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మరోవైపు ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఊహగానాలు వస్తుండగా, గుత్తా తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరగ్గా, కోమటిరెడ్డి దానిని తీవ్రంగా ఖండించారు. పార్టీలో చివరి వరకూ ఉండేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇంకోవైపు నల్లగొండ జిల్లా, కరీంనగర్ జిల్లాల్లో నేతల మధ్య కోల్డ్‌వార్ జరుగుతుండడం, పార్టీ రాష్ట్ర నాయకత్వం వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే.
త్వరలో కొత్త నియామకాలు
ఇదిలా ఉంటే, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇంచార్జీలను నియమించనున్నట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయటం ఇప్పుడిప్పుడే సాధ్యం కాకపోయినా తెలంగాణాలో కాంగ్రెస్‌ను బతికించుకోవటంతోపాటు కొద్దిగా కష్టపడితే మళ్లీ పుంజుకునేలా చేయవచ్చునని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే అన్ని వర్గాలను కలుపుకుని పని చేయ గలిగే నాయకుడికి తెలంగాణా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ప్రస్తుత ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌పై రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఫిర్యాదు చేయటం విధితమే. దిగ్విజయ్ సింగ్ తెలంగాణా కాంగ్రెస్‌లోని ఒక వర్గం వారినే ప్రోత్సహిస్తున్నారు తప్ప పార్టీ అభివృద్ది కోసం పని చేయటం లేదన్నది ఆయనపై వస్తున్న ప్రధాన ఆరోపణ.