సబ్ ఫీచర్

అమ్మో..! రక్తదానమా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు. కాని అదే దానం ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంటే.. అమ్మో ఈ నిజానే్న భరించలేం. కాని ఇది నమ్మలేని చేదు నిజం. రక్తదానం పేరుతో సేకరిస్తున్న రక్తాన్ని స్వీకరించినవారు ప్రాణాంతకమైన ఎయిడ్స్ బారినపడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. ఈ చేదు నిజాన్ని నిజం చేస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లినిక్‌వారు ఈ ఏడాది వివిధ ఆసుపత్రులలోని రోగులకు సరఫరా చేసిన రక్తం వల్ల దాదాపు 2,234మందికి హెచ్‌ఐవి సోకినట్లు వెల్లడవ్వటం సర్వత్రా ఆందోళనకలిగిస్తోంది. దేశంలో రక్తం సేకరించే కేంద్రాలు సరైన ప్రామాణికాలు పాటించకపోవటం వల్లే ఇలాంటి దారుణాలు సంభవిస్తున్నాయి. ఇది మనదేశంలోనే కాదు అభివృద్ధిచెందిన దేశాలలో సైతం ఇలాంటి ఘోరాలు సంభవిస్తున్నాయి. కాకపోతే పర్సంటేజీలలో తేడామాత్రమే. 17 నెలల వ్యవధిలోనే దాదాపు 2,234 మందికి హెచ్‌ఐవి సోకటంతో వారి జీవితాలు అంధకారమయ్యాయి. దేశంలో హెచ్‌ఐవి బాధితులు దాదాపు 2.09 మిలియన్ల మంది వరకు ఉన్నారు.
రక్తాన్ని రెగ్యులర్‌గా సేకరించే కేంద్రాలతో పాటు వలంటీర్‌గానూ, దాతల నుంచి సేకరిస్తుంటారు. గతంలో డబ్బులకు పేదలు రక్తాన్ని అమ్ముకునేవారు. రక్తాన్ని అమ్ముకునే ఇలాంటి నిరుపేదల సంఖ్య పెరగటం, ఇలా సేకరించిన రక్తాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటంతో డబ్బులు చెల్లించి రక్తాన్ని సేకరించే కేంద్రాలను నిషేధించారు. ఇదే ఒవిధంగా సంతోషమే. రక్తాన్ని దానం చేసే వ్యక్తికి అన్నిరకాల వైద్య పరీక్షలు చేసిన తరువాతే రక్తాన్ని సేకరిస్తారు. వాస్తవానికి హెచ్‌ఐవి సోకిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించినా అది కొన్ని వారాలకుగానీ బయటపడదు. ఈలోపే ఆ వ్యక్తి రక్తదానం చేస్తే..? ఇక రక్తదానాన్ని స్వీకరించిన వ్యక్తి జీవితం చీకటిమయం. ఉన్న రోగం వదలించుకుందామంటే కొత్త రోగం అంటుకోవటమే. రక్తదానం చేసే వ్యక్తి పాత మెడికల్ చరిత్ర పరిశీలించకుండానే రక్తాన్ని సేకరిస్తున్నారు. దీని వల్ల హెచ్‌ఐవి, హెపటిటిస్ బి, హెపటీటిస్ సి అనే వ్యాధులు అంటుకుంటున్నాయి. దేశంలో వంద స్మార్ట్ సిటీలు ఉండగా.. కనీసం సిటీకి ఒకటి చొప్పునైనా ప్రామాణికమైన రక్తసేకరణ కేంద్రాలను ఏర్పాటుచేస్తే ప్రాణాంతక వ్యాధులు సోకకుండా నిర్భయంగా రక్తదానాన్ని స్వీకరిస్తారు.