Others
సొగసైన క్రాపుకోసం 16వేల డాలర్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/30sogasina.jpg?itok=Db87iFmb)
ఆడాళ్లు అందాల శిరోజాలంకరణ కోసం తెగ ఖర్చుపెడతారంటారు గానీ, మగాడు అందులోనూ, ఇజ్రేలీ ప్రధానమంత్రిగారు శ్రీ బిన్యామిన్ నెత్సాయహూ- అమెరికా యాత్రకోసం, ఆడది కూడా అసూయపడేటంత ముస్తాబు... ఖర్చుచేశాడని అతన్ని ప్రజలు యిప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు.
తన సతీమణి సారా (అమ్మో! ఓ అందాల మణి)తో అమెరికా విజిట్ చేయడానికి, ఆయన ఖర్చుపెట్టిన ప్రజాధనం కేవలం 541,886 డాలర్లు. అనగా 382000 పౌండ్లు. (ఎన్ని కోట్ల రూపాయలో!?) మాత్రమే!! సరే, అందులో కేవలం తన క్రాఫింగును చక్కదిద్దుకోడానికే పదహారు వందల డాలర్లు బార్బర్కిచ్చాడట!
అదెంత అందమైన శిరోజాలంకరణో- ఫొటో చూడండి తెలుస్తుంది. ఆయన వచ్చింది ఐక్యరాజ్యసమితి మీటింగ్‌కి. కానీ దానికోసం యిదే కాకుండా యితర మేకప్కోసం అదనంగా 1750 డాలర్లు ఖర్చు అయిందిట! ‘‘వారేవా! ఆడదై పుట్టాల్సింది. ఎంత సౌందర్య పోసనా? బాబూ, మొగాడికీ?’’అంటూ, అంతా దవడలు నొక్కుకున్నారుట.