కలలో రాజకుమారి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, నమితాప్రమోద్ జంటగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో కార్తిక శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘కలలో రాజకుమారి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, పరిణితి చెందిన రెండు జంటల మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం ఇదని అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నామని, ఈనెల 15వరకు జరిగే షెడ్యూల్‌తో మూడు పాటలు, టాకీ పార్ట్ పూర్తవుతుందని అన్నారు. ఆగస్టులో జరిగే చివరి షెడ్యూల్లో మిగతా మూడు పాటలను షూట్ చేస్తామని, ఈనెల రెండో వారంలో ఫస్ట్‌లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ల భరణి, అజయ్, ప్రభాస్‌శ్రీను, స్వామిరారా సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయేష్‌నాయర్, సంగీతం: ఇళయరాజా, పాటలు: కృష్ణచైతన్య, రామజోగయ్యశాస్ర్తీ, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, నిర్మాణం: మ్యాగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాత: కార్తికేయ శ్రీనివాస్, దర్శకత్వం: మహేష్ సూరపనేని.