రాష్ట్రీయం

ఖమ్మం జిల్లాను ముంచెత్తుతున్న వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 30: ఖమ్మం జిల్లాను వర్షం ముంచెత్తుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం శుక్రవారం కూడా కొనసాగింది. జిల్లాలోని చెరువు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌ల్లోకి నీరు వచ్చి చేరింది. కినె్నరసాని రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవటంతో గేట్లను ఎత్తి నీళ్ళను వదులుతున్నారు. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ 3గేట్లు గత రెండు రోజులుగా తెరిచి ఉన్నాయి. వీటికి తోడుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరు ప్రాజెక్ట్ నిండింది. దీంతో ఆ ప్రాజెక్ట్‌కు ఉన్న 26గేట్లను ఎత్తి గోదావరిలో నీటిని వదులుతున్నారు. వర్షాల తాకిడికి అశ్వారావుపేట మండలంలోని పది గ్రామాలకు, గుండాల మండలంలోని 18గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాకు సరిహద్దులో పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ఖమ్మం జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి. వేలేరుపాడు మండలం పూర్తి జలదిగ్భంధనంలో చిక్కుకున్నది. జిల్లాలోని పాలవాగు, మసివాగు, బుగ్గవాగు, అగ్గివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎటు వైపు చూసినా నీరు నిండిపోయి ఉంది.