అల్లుడు బంగారమేనా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 July 2016
‘సరైనోడు’ విజయంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన బోయపాటి శ్రీను ఇప్పుడు తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే ఈ సినిమాకు మరోసారి పాత సెంటిమెంట్‌ను వర్కవుట్ చేసేలా ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’తో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేశాడు. ఇక ఆ తరువాత చేసిన ‘స్పీడున్నోడు’ ప్లాప్‌ను మూటగట్టుకుంది. దాంతో మళ్ళీ హిట్‌కొట్టాలనే ప్లాన్‌లో భాగంగా ఈ సినిమాకు ‘అల్లుడు బంగారం’ అనే టైటిల్ ఓకే చేశారట!! ఎంతైనా సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవే లేదు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్‌నే వర్కవుట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ టైటిల్‌ను వీరి బ్యానర్లో రిజిస్టర్ చేయించడంతో ఈ టైటిల్ ఈ సినిమాకోసమే అని తెలుస్తోంది.