రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
వారంలోగా ఇంటికి చేరనున్న శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 17: నైజీరియాలో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన ఇంజనీర్ సాయి శ్రీనివాస్‌ను వారం రోజుల్లోగా స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని ఆయన కుటుంబీకులను ఆదివారం పరామర్శించిన మంత్రి.. భార్య లలితతో మాట్లాడారు. నైజీరియా కిడ్నాప్ కథ సుఖాంతమైందని, అయితే కొన్ని సాంకేతిక కారణాలతో శ్రీనివాస్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని స్వస్థలానికి తిరిగి వస్తారని మంత్రి వివరించారు. నైజీరియాలో విశాఖ వాసి కిడ్నాపైన విషయాన్ని స్థానిక అధికారులు తనకు వివరించారని, సిఎం చంద్రబాబు, భారత విదేశాంగ శాఖతో చర్చించి విడుదలకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇదే సందర్భంలో భర్తను ఎక్కడో విదేశంలో కిడ్నాప్ చేసిన ఉదంతం తెలిసినప్పటికీ ఎంతో గుండె ధైర్యంతో ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి, భర్తను విడుదలకు పట్టుదలతోశ్రమించిన లలితను మంత్రి గంటా అభినందించారు. ఇదే ఆత్మస్థైర్యాన్ని మహిళలు అలవరచుకోవాలన్నారు.