రాష్ట్రీయం

టాస్క్ఫోర్స్ పోలీసులపై ఎర్రకూలీల రాళ్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 21: తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో గురువారం తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులపై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ దిలీప్‌కుమార్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. పలువురు కూలీలు పారిపోగా ఇద్దరు కూలీలు పట్టుబడ్డారు. శేషాచలం అడవుల్లోని పుట్టగద్ద సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా 20 మంది ఎర్రకూలీలు పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను చూసిన ఎర్రకూలీలు ఒక్కసారిగా రాళ్లతో దాడికి దిగారు. లొంగిపొమ్మని హెచ్చరించినా కూలీలు ఏమాత్రం భయపడకుండా రాళ్లవర్షం కురిపించారు. ఈ సంఘటనలో దిలీప్‌కుమార్ అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఎక్కడ చంపేస్తారోనని భయపడ్డ కూలీలు పలాయన బాట పట్టారు. దీంతో పోలీసులు వారిని వెంటాడారు. కూలీలు ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు పరుగులు తీశారు. అయినప్పటికీ పోలీసులు పట్టువిడవకుండా కూలీల వెంటపడి ఇద్దరు కూలీలను పట్టుకున్నారు. పారిపోయిన కూలీల కోసం కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. పట్టుబడ్డ కూలీలపై కేసు నమోదు చేశారు. గాయపడ్డ దిలీప్‌కుమార్ రుయాలో కోలుకుంటున్నాడు.