ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలకు 275 ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు విజయవాడ తదితర ప్రాంతాలకు ప్రయాణీకుల సౌకర్యార్థం 275ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 100, విశాఖపట్నం నుంచి 100, తూర్పుగోదావరి జిల్లా నుంచి 75 చొప్పున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విజయవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు వెళ్లవన్న విషయాన్ని ప్రయాణీకులు గుర్తించాలన్నారు. విశాఖపట్నం వైపు నుంచి వెళ్లే బస్సులు విజయవాడలోని వైవి రావు ఎస్టేట్స్ వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్‌కు, ఉభయగోదావరి జిల్లాల బస్సులు ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్శిటీ వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్‌కు చేరుకుంటాయని వివరించారు. అక్కడి నుంచి సిటీబస్సుల ద్వారా స్నానఘట్టాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం విజయవాడలో 700 ఉచిత సిటీ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. తాత్కాలిక బస్టాండ్లలో ప్రయాణీకులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు రూ.40-50కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్ సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.