ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిన వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయక పోవడం, కాల్‌మనీ వ్యవహారంపై చర్చ చేపట్టక పోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శీతాకాల సమావేశాలకు తాము హాజరయ్యే ప్రసక్తి లేదని విపక్ష నాయకులు వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని మరోసారి పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ స్పీకర్ అందుకు అంగీకరించలేదు. నిబంధనల ప్రకారమే రోజాను సస్పెండ్ చేశామని, ఆ వ్యవహారంపై చర్చ ఇక అనవసరమని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీంతో జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ సమావేశాల నుంచి నిష్క్రమించారు.