దసరాకు రజనీ ద డాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభి సుబ్రహ్మణ్యం క్రియేషన్స్ పతాకంపై సుబ్బు కథానాయకుడిగా శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో శివపురం సురేందర్ కుమార్ రూపొందిస్తున్న ‘రజనీ ది డాన్’ చిత్రం దసరాకు ప్రారంభం కానుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- ఏ బంధం లేని కథానాయకుడికి అనుకోకుండా ఓ బంధం ఏర్పడడంతో అతని జీవితం ఎలా మలుపు తిరిగింది అనే కథనంతో ఆదత్యంత ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో వుంటుందని తెలిపారు. ఐదు పాటలతో రూపొందనున్న ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయికలతోపాటుగా విలన్‌గా నటించే మరో హీరో కూడా కనిపిస్తారని, వారి పేర్లను త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం తమ సంస్థలో రెండు చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు జరుపుతున్నామని, అక్టోబర్ 11 విజయదశమి పర్వదినాన ‘రజనీ ది డాన్’ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తిచేస్తామని తెలిపారు. వైజాగ్, బెంగుళూరు, కొడైకెనాల్, ఊటీలలో షూటింగ్ జరిపే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు.