మెయన్ ఫీచర్

చైనా బెదిరింపు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని దీవులు తనవే నంటూ చైనా చేస్తున్న వాదనను తిరస్కరిస్తూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పినదగ్గరినుంచి, డ్రాగన్‌లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. యుద్ధోన్మాదంతో సైనిక పరమైన ప్రతిచర్యకు పూనుకునే రీతిలో చైనా ప్రతిస్పందన ఉంటుందన్నది అంతా అనుకున్నదే అయినప్పటికీ, మరోవిధమైన యుక్తులు కూడా వ్యక్తం కా వడం గమనార్హం. ఇప్పుడు చైనా తనకు వ్యతిరేకంగా జట్టుకడుతున్న దేశాలపై ఆర్థికపరమైన పెత్తందారీతనంతో బలవంతంగా లొంగదీసుకునే వ్యూహాన్ని అమలుచేస్తోంది. ఆవిధంగా చైనానుంచి నిరంతరం హెచ్చరికలు అందుకుంటున్న దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఆర్థికపరం గా చైనా మార్కెట్లపై అధికంగా ఆధారపడటమేకాదు, చైనా పెట్టుబడులు పెద్దమొత్తంలో ఉండటం కూడా ఈ బెదిరింపులకు నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఫిలిప్పీన్స్, వియత్నాం, జపా న్, యుఎస్‌లకు అనుకూలంగా వ్యవహరించినట్లయితే తీవ్రపరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని చైనా, ఆస్ట్రేలియాను బెదిరిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక ‘గ్లోబ ల్ టైమ్స్’ ఆస్ట్రేలియాను ‘అప్రతిష్ట చరిత్ర’ కలిగిన ‘కాగితంపులి’ అంటూ అపహసించింది. ఇక చైనా విదేశాంగ ప్రతినిధి ఒకరు మాట్లాడు తూ, ‘‘ఆస్టేలియా జాగ్రత్తగా మాట్లాడాలి, మెళకువగా వ్యవహరించాలి’’అంటూ హెచ్చరించాడు.
ఆస్ట్రేలియా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ప్రైవేటుగా చైనా ప్రభుత్వం, ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌కు చాలా గట్టి హెచ్చరికనే జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ‘‘స్వే చ్ఛా సముద్రయానం’’ పేరుతో, తన ఆక్రమణలో ఉన్న పగడాలదిబ్బలు, కొండ గుట్టల ప్రాంతానికి 12 నాటికల్ మైళ్ల పరిధిలో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు అమెరికాతో చేతులు కలిపితే అందుకు భారీగా ‘‘ఆర్థిక మూల్యం’’ చెల్లించాల్సి వస్తుందని చైనానుంచి తీవ్రస్థాయి హెచ్చరికలను ఆయన అందుకున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం ఆశాజనకంగాలేదు. ముఖ్యంగా చైనాలో ఆర్థిక ప్రగతి తిరోగమనంలో ఉన్న నేపథ్యం ఆ దేశంపై ఆధారపడిన ఆస్ట్రేలియా పరిస్థితిని మరింత కృంగదీసింది. ఈ నేపథ్యంలో చైనా ఏవిధమైన ప్రతికూల చర్యలకు ఉపక్రమించినా టర్న్‌బుల్ విపత్కర పరిస్థితులను చవిచూడక తప్పదు. దీన్ని బ్లాక్‌మెయిల్ లేదా స్మార్ట్ డిప్లొమసీ అని ఏపేరుతో పిలిచినా, తన చుట్టుపక్కల దేశాల సుసంపన్నతలో తానెంత విడదీయరాని సంబంధాన్ని కలిగివున్నాననేది చైనా బాగా అర్థం చేసుకుంది. అం దుకనే తన రాజకీయ లక్ష్యాలను సాధించడాకి ఆయా దేశాలనుంచి వ్యూహాత్మక రాయితీలను కోరుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ దౌత్యపరంగా ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్న మాట నిజం. ఫిలిప్పైన్స్, వియత్నాం, జపాన్‌లతో సహకారాన్ని పెంపొందించుకోవడమే కా కుండా, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని నిరోధించే రీతిలో అమెరికాతో కలిసి ఉమ్మడి ప్రకటనలు జారీ చేస్తున్న భారత్‌ను కూడా చైనా వదిలిపెట్టలేదు. దక్షిణ చైనా సము ద్ర వ్యవహారాల్లో అనవసరంగా వేలుపెట్టవద్దని, ఆవిధంగా చేయడం వల్ల ఇప్పటి వరకు కొనసాగుతున్న ఇరుదేశాల సంబంధాలపై అనవసరంగా ప్రతికూల ప్రభావాలు పడతాయంటూ మందలించింది. అంతేకాదు ఆవిధంగా చేయ డం వల్ల చైనాలో తమ ఉనికిని మరింత పెంచుకోజూస్తున్న భారత ఎగుమతిదార్లకు అడ్డంకు లు ఏర్పడతాయని కూడా హెచ్చరించింది.
ఈ ఏడాది రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలు, రాజకీయపరమైన సంఘటనల కారణంగా చైనాకు భారత ఎగుమతులు 16.7 శాతం పడిపోయాయని గ్లోబల్‌టైమ్స్ గుర్తు చేసింది. ప్రధాని నరేద్రమోదీ తాను ప్రవచించిన ‘‘మేకిన్ ఇండియా’’ మరింత విజయవంతం కావాలంటే, దక్షిణ చైనా సముద్రం వ్యవహారాలపై చర్చల్లో కలుగజేసుకోకుండా ఉండటమే ఉత్తమమని స్పష్టం చేసింది. ఇటీవల భారత్‌ను సందర్శించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ దక్షిణ చైనా సముద్రంపై డొం కతిరుగుడుగా మాట్లాడుతూ, ‘‘తాను ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నది భారత్ నిర్ణయించుకోవాలి’’ అని పేర్కొనడం గమనార్హం. ఇక్క డ ఆయన చైనా వ్యవహారశైలిపై ప్రపంచ వ్యా ప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పేర్కొనకపోవడం గమనార్హం.
దక్షిణ చైనా సముద్రం వ్యవహారంలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే ‘‘ఆర్థిక కొరడా’’ను పరిమితం చేయడంలేదు. చైనాతో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, భారత్ యుద్ధ ట్యాంకులను మోహరించడంపై, గ్లోబల్‌టైమ్స్ వ్యాఖ్యానిస్తూ, భారత్‌లో తమ ప్రత్య క్ష పెట్టుబడులను ఉపసంహరిస్తామంటూ హెచ్చరించింది. న్యూఢిల్లీ చేపడుతున్న సైనిక చర్యలు, ‘‘తమదేశానికి చెందిన వాణిజ్యవేత్తలు భారత్‌లో పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునే ముందు, రాజకీయ అస్థిరత అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు’’ అని వ్యాఖ్యానించింది.
నిజానికి నరేంద్రమోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ బాగా పెరిగినమాట వాస్తవం. అంతేకాదు పెట్టుబడులకు భా రత్ ఒక గమ్యస్థానమన్న అభిప్రాయాన్ని మో దీ సృష్టించగలిగారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తమ దేశంనుంచి భారత్‌లోకి పెట్టుబడులు రాకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. సుస్థిరంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారత్‌ను వదిలేసి, అభద్రత, ఉగ్రవాదానికి నిలయమైన పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి చైనా ముందుకు రావ డం కేవలం, భౌగోళికంగా ఆసియాలో ఆధిపత్యాన్ని సాధించడానికి, ఆసియా దేశాలు తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలన్న డ్రా గన్ ఆకాంక్షలను వెల్లడిస్తున్నది. ఒక అగ్రరాజ్యంగా ఎదిగిన చైనా, ప్రపంచంలోని ఇతరదేశాలపై ఆర్థికపరమైన బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టింది. చైనా పాక్షిక పెట్టుబడితో నిర్మించ తలపెట్టిన హింక్లే పాయింట్ అ ణువిద్యుత్ ప్రాజెక్టును బ్రిటన్ నూతన ప్రధాని థెరెసా మే భద్రతా కారణాల రీత్యా నిలిపివేశా రు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 24 బిలియన్ డాలర్లు. భవిష్యత్తులో బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదొక దుశ్శకునమని బీజింగ్ వ్యాఖ్యానించింది.
అమెరికాతో కూడా చైనా భిన్నంగా ఏమీ ప్ర వర్తించడంలేదు. అమెరికా సైనికశక్తిని, ఆర్థిక కారకాలను చూపి అడ్డుకోవడానికి యత్నిస్తోం ది. సైనికంగా చైనాను చుట్టుముట్టాలని పెంటగాన్ వాంఛిస్తున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం మాత్రం నిగ్రహం పాటిస్తోంది. చైనాతో కొనసాగుతున్న మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను పరిగణలోకి తీసుకోవడం వల్లనే ఒబామా ప్రభు త్వం సైనిక చర్య విషయంలో ముందడుగు వేయలేకపోతోంది. ముఖ్యంగా చైనాలో కొనగుతున్న అమెరికా పెట్టుబడుల పరిస్థితిని, చైనా కొన్ని ట్రిలియన్ డాలర్ల మొత్తాన్ని అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడిగా పెట్టిన అం శాలు, అమెరికా ప్రభుత్వాన్ని సంఘర్షణకు దిగకుండా అడ్డుకుంటున్నాయి.
గతంలో తైవాన్ విషయంలో, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఏకాకిని చేసేందు కు చైనా తన ‘‘వన్ చైనా పాలసీ’’ని అంతర్జాతీయ సమాజంచేత ఆమోదింపజేసుకునేందు కు ఒకపక్క ఆర్థికపరమైన బెదిరింపులకు పా ల్పడిన, మరోపక్క ఆర్థిక ప్రోత్సాహకాలను ఎరచూపిన చరిత్ర ఉంది. ఇవే అంశాలపై ఆసియ న్ దేశాల కూటమిలో కూడా విభజించు పా లించు అనే రీతిలో తన విధానాన్ని కొనసాగించింది. నేడు చైనాలో పరిపూర్ణ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. తనకున్న ఆర్థిక వనరుల దన్ను తో,ప్రపంచ దేశాలనుంచి గరిష్ఠ స్థాయి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి యత్నిస్తోం ది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల కాలంగా చైనా తన వాణిజ్య, ఇతరదేశాల్లో విస్తృతంగా పెట్టిన పెట్టుబడుల నేపథ్యంలో ఆస్తులు ఒనగూడటమే కాకుండా, ఆయా దేశాలతో కొనసాగించిన సంబంధాల నేపథ్యంలో గణనీయమైన ఆర్థిక పరిపుష్ఠిని సాధించింది. ఈవిధంగా తాను సాధించిన ఆర్థిక ప్రగతిని, ఆయా వాణిజ్య సంబంధాలను చూపి, ఆర్థికేతర రంగాల్లో కూడా ఇతర దేశాలనుంచి ప్రయోజనాలను పొందాలని చూస్తున్నది. ముఖ్యంగా తాను సాధించాలనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు తన ఆర్థిక శక్తిని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నది. అయితే ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి మాంద్యాన్ని ఎదుర్కొంటూ, మార్పులకు లోనవుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా ఈ ఆర్థిక ‘ఆయుధ’ ప్రభావం ఇప్పుడే సమసిపోదు.
అమెరికాకు చెందిన మేధావి విలియం నోరి స్ ఈవిధంగా తన వాదనను వినిపిస్తున్నారు. ‘‘ఒక దేశం ఆర్థిక రాజనీతిలో విజయం సాధించడమనేది, అది తన కార్పొరేట్ రం గాన్ని, ఆర్థి క సంస్థలను ఎంత సమర్ధవంతంగా నియంత్రించగలదనేదానిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇతర దేశాలను తన మార్గంలోకి తెచ్చుకునేందుకు ఇది చాలా అవసరం.’’ చరిత్రలో చైనాలో మాదిరిగా కేవలం ప్రభుత్వ మార్గదర్శకత్వంలో నడిచే పెట్టుబడిదారి వ్య వస్థ ఉండటం చాలా అరుదు. ప్రస్తుతం ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలు, సార్వభౌమ సంపదపై సం పూర్ణ నియంత్రణ కలిగివుంది. నిజంగా ఈ సం పద శక్తి, విదేశాలకు చెందిన స్థావరాల్లో మోహరించిన సైనిక బలగాలతో సమానం. మరి క్ర మంగా పెరుగుతున్న చైనా ఆర్థికపరమైన బెదిరింపుల సమస్యనుంచి ఇతర దేశాలు ఏవిధం గా బయటపడగలవు? వాణిజ్యాన్ని, పెట్టుబడులను బహుముఖం చేయడం ఒక్కటే ఇక్కడ మార్గం. మొత్తం పెట్టుబడుల అవకాశాన్ని కేవలం ఏఒక్కదేశానికో పరిమితం చేయకుం డా ఉండటం. ఈ రెండిటిని సాధించినట్లయితే ఆయా దేశాలు ఈ సరికొత్త సమస్య నుంచి బయటపడగలవు. అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు.
ఒక దేశ ఆర్థిక పరిస్థితికి మూల స్తంభాలు గా ఇతర వ్యవస్థలుకూడా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు చైనావద్ద బెదిరించడానికి బలీయమైన ఆయుధం ఉండదు. అంతేకాదు పెట్టుబడులు పరస్పరం కొనసాగాలి. అంటే వాణి జ్యం, పెట్టుబడులు చైనాతో సరిసమానంగా కొ నసాగాలి. అప్పుడే ఇటువంటి బ్లాక్‌మెయిల్‌కు అవకాశం ఉండదు. లేని పక్షంలో పూర్తిగా ఆధారపడవలసి వచ్చి, చైనా చెప్పినట్టల్లా వినా ల్సి ఉంటుంది. ఒక దేశంతో వాణిజ్యలోటు కొనసాగడాన్ని చెడు పరిస్థితిగా భావించడానికి వీల్లేదని కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం. అయితే చైనాతో వ్యవహరించే సమయంలో దీర్ఘకాలికంగా సమతుల్య వాణిజ్యం, ఎఫ్‌డిఐలను కొనసాగిస్తేనే, ఆ దేశ రాజకీయపరమైన దోపిడీని అడ్డుకోవడం సాధ్యం.

- శ్రీరామ్ చౌలియా