రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల సిఎస్‌ల పదవీకాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సత్యప్రకాష్ టక్కర్, రాజీవ్ శర్మ మరో మూడు నెలలపాటు అదే పదవుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. టక్కర్, రాజీవ్ శర్మ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్‌లు ప్రధాన కార్యదర్శుల సర్వీసులను మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లేఖలపై స్పందించిన కేంద్రం వారి పదవీకాలం పొడిగించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.

సింగపూర్‌లో 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

విశాఖపట్నం, ఆగస్టు 24: నవంబర్ 5 నుంచి రెండు రోజులపాటు 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్‌నాయక్ ఫౌండేషన్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సింగపూర్ తెలుగు సమాజం, మలేషియా తెలుగు సంఘం ఉమ్మడిగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, మయన్మార్, సౌత్ ఆఫ్రికా దేశాలతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు సాహితీవేత్తలు, రచయితలు ఈ సదస్సుకు హాజరవుతున్నట్టు తెలిపారు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు. ఆయా దేశాల రచయితలు, సాహితీవేత్తలతో ముఖ పరిచయానికి ఇది వేదికకానుందన్నారు. తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనే రచయితలు, సాహితీవేత్తలకు రవాణా, వసతి సదుపాయం నిర్వహణ సంస్థలు కల్పిస్తాయన్నారు. వంగూరి ఫౌండేషన్ చైర్మన్ వంగూరి చిట్టిరాజు మాట్లాడుతూ తొలి రెండు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులను అమెరికాలో నిర్వహించగా, మూడు ప్రపంచ సదస్సును అమెరికాలోను, నాలుగో సదస్సును లండన్‌లోను నిర్వహించామన్నారు. 5వ సదస్సును సింగపూర్‌లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధికి తమ సంస్థ విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఇప్పటివరకూ 63 రచనలను తాము పుస్తకాలుగా ముద్రించినట్టు తెలిపారు.