Others

ముదిరిన ఇడియట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కి సంచలనం సృష్టించిన త్రీ ఇడియట్స్ గుర్తున్నారుగా. ఆ కుర్రాళ్లు ఇప్పుడు ముదిరిపోయారు. కొత్త పాయింట్ పట్టుకుని నడివయసు అవతారాల్లో సీక్వెల్‌గా రాబోతున్నార్ట. రాజ్‌కుమార్ హిరాణి స్వయంగానే కన్ఫర్మ్ చేసేశాడు కనుక, ప్రాజెక్టు పనులు ఇప్పటికే మొదలైపోయి ఉంటాయని ఇండస్ట్రీ టాక్. పైగా సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. ఊపు గట్టిగానే ఉంది కనుక, ఇదే టైం అనుకున్నాడో ఏమో.. మళ్లీ సెనే్సషన్ క్రియేట్ చేయటానికి రెడీ అయిపోతున్నాడు. రచయిత అభిజిత్‌తో కలిసి ఓ వైవిధ్యమైన లైనుకు కథను కుదిర్చారట. అది విన్న అమీర్ సైతం ‘ప్రొసీడ్’ అనడంతో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి. అప్పట్లో ‘త్రి ఇడియట్స్’ హిట్ రేంజ్ -తెలియంది కాదు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్‌ని సమపాళ్లలో రంగరించి నవ్విస్తూనే ఏడిపించాడు -హిరాణి. బెస్ట్ రిజల్ట్ కోసం నూరుశాతం తపనపడే అమీర్‌తో పని చేయడానికి ఇష్టపడే హిరాణి -సీక్వెల్‌ను ఎలా తీర్చిదిద్దుతాడన్న ఆసక్తి కనిపిస్తోంది. కాలేజీ కుర్రాళ్ల చుట్టూ తిరిగిన కథ -చాలా కాలమైంది కనుక -ఇప్పుడు ఆ బ్యాచ్ నడివయసుకు చేరినట్టు చూపబోతున్నాడట. అదీ మరి -హిరాణి సినిమా తెలివి.