రాష్ట్రీయం

ఇక రహదారుల రాజసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: రాష్ట్రంలో 13,500 కోట్ల రూపాయల వ్యయంతో 1350 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల పనులను చేపడతామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు చెప్పారు. వీటికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్రానికి పంపించి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం రోడ్ల నెట్‌వర్కును డిజిటలైజ్ చేయాలని కూడా అధికారులను కోరారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే కృష్ణా పుష్కరాల్లోగా పూర్తికావాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం సీనియర్ అధికారులతో రోడ్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపడుతున్న రహదారుల పనులు, ప్రణాళికలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారీ ప్రకటించిన ప్యాకేజీ మేరకు ప్రాజెక్టుల వారీగా కేంద్రానికి అందించాల్సిన నివేదికలు, డిపిఆర్‌లను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. మొత్తం 413 కిలోమీటర్లు మేర అనంతపురం తాడిపత్రి తొక్కపల్లి నరసరావుపేట-గుంటూరు జాతీయ రహదారి (నేషనల్ హైవే 544డి) పనులను ఈ ఏడాదే ప్రారంభించాలని చెప్పిరు. అలాగే మొత్తం 125 కిలోమీటర్లు మేర కర్నూలు-నందికొట్కూరు-ఆత్మకూరు-డోర్నాల జాతీయ రహదారి (నేషనల్ హైవే నెంబర్ 340 సి) పనులను కూడా చేపట్టాలని అన్నారు. నేషనల్ హైవే 16 ఆనందపురం నుండి రాజమండ్రి వరకూ 130 కిలోమీటర్లు మేర రీ ఎలైన్‌మెంట్ చేయాలని అన్నారు.
జనవరి 31లోగా రాష్ట్రంలోని అన్ని రహదారుల్లో గుంతలు పూడ్చాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అలాగే రహదార్ల కట్టలు, గట్ల పనులు కూడా ఆలోగానే పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన రహదారుల పనులపై రోజువారీ సమీక్ష చేసి ఎప్పటికపుడు ప్రగతి నివేదికలు ఇవ్వాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం, నిర్వహణ కోసం నాబార్డు నిధులను ఉపయోగించుకునేందుకు అవసరమయ్యే ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం అధికారులను సూచించారు. అంతేగాక, ప్రపంచబ్యాంకు, జైకా నుండి రహదారుల నిర్మాణానికి నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. వచ్చే మూడేళ్లలో రహదారుల పనుల ప్రాధాన్యతా క్రమాన్ని సంవత్సరాల వారీ నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని అన్నారు.
అమరావతి నగరానికి చుట్టూ 180 కిలోమీటర్లు మేర అవుటర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దీనికి 20వేల కోట్ల రూపాయిలు వ్యయం అవుతుందని సిఎం పేర్కొన్నారు. అంతకుముందు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన సిఎం ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులను అనుకున్న సమయానికే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
జనవరి 2 నుంచి జన్మభూమి
జనవరి 2 నుండి జన్మభూమి -మావూరు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సిఎం చెప్పారు. రెండో దశలో 3వ తేదీ నుండి 7వ తేదీ వరకూ ప్రజా పంపిణీ, సామాజిక సాధికారత, నైపుణ్యాలు, పట్టణాభివృద్ధి, సమాచార భాగస్వామ్యం, రైతుల రుణమాఫీ, డ్వాక్రా గ్రూప్‌ల వ్యవహారం, పాస్‌బుక్‌ల పంపిణీ, ఎన్టీఆర్ భరోసా తదితర అంశాలు చర్చిస్తారని అన్నారు. 2వ తేదీన స్మార్టు విలేజ్-స్మార్టు వార్డు అంశంపై ప్రజాచైతన్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
అమరావతి బృహత్ ప్రణాళికపై సిఆర్‌డిఎ గురువారం రాత్రి నోటిఫికేషన్ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి బృహత్ ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 30 రోజుల్లో ప్రజలు మార్పులు చేర్పులు సూచించవచ్చని చెప్పారు. బృహత్ ప్రణాళిక అనంతరం భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని అన్నారు.