ఆంధ్రప్రదేశ్‌

జగన్‌పై బాబు నిప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 1: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్మాదిగా మారారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారన్నారు. జగన్ ఎత్తులను ప్రజలు గమనిస్తున్నారని, చూస్తూ ఊరుకోరని అన్నారు. కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లె కంచరపల్లె బహిరంగసభలో మాట్లడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు. 2003లో తిరుపతి అలిపిరి వద్ద తనపై హత్యాయత్నానికి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పురిగొల్పింది వైఎస్ కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. సీనియర్ రాజకీయ నాయకుడిని, ప్రధానమంత్రి నియామకంలో ప్రధానపాత్ర పోషించిన నన్ను పట్టుకుని జగన్ వ్యంగంగా మాట్లాడతారని, చెప్పులు, చీపుర్లతో కొట్టమనడం నీతిమాలిన రాజకీయం కాదా అని అన్నారు. ప్రతిపక్షనేత అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. తుపాకుల సంస్కృతిని పూర్తిగా రూపుమాపేందుకే తాను రైతులకు రైయిన్‌గన్లు ఇచ్చి కరవు పారదోలేందుకు వారిని ప్రోత్సహిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏకరాకు సాగునీరు ఇచ్చి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తుంటే రైతు, ప్రజా సంక్షేమాన్ని ఓర్వలేక వైకాపా నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎవ్వరెన్ని అడ్డంకులు సృష్టించినా బెదిరే ప్రసక్తి లేదని, బుల్లెట్‌లా ముందుకు దుసుకెళ్తానని అన్నారు.