పవన్ కంటే నేనే బెస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలనాలు రేపడంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని, ఇప్పటికే ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన ఆయన తాజాగా మరో సంచలనానికి తెరలేపాడు. ‘పవన్ కంటే నేనే బెస్ట్ సింగర్‌ని’ అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పవన్‌కళ్యాణ్ రెండురోజుల క్రితం కాకినాడ బహిరంగ సభలో ఓ జానపద గేయం పాడారు. ఆ పాటను వర్మ ప్రస్తావిస్తూ, పవన్ కంటే తానింకా బాగా పాడగలనని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న వంగవీటి చిత్రంలో ఓ పాటను పాడారు. గతంలో రక్తచరిత్రలో వర్మ పాట పాపులర్ అయ్యింది. విజయవాడ నేపథ్యంలో వంగవీటి రంగా కథ ఆధారంగా తెరకెక్కుతున్న వంగవీటి చిత్రం విడుదలకు సిద్ధవౌతోంది.