పిల్ల రాక్షసి వస్తోంది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిచ్చగాడు’ చిత్రాన్ని అందించిన నిర్మాతలు తాజాగా మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని పిల్ల రాక్షసిగా అనువాదం చేస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న ఈ చిత్రం మలయాళంలో ఆన్ మరియ కలిప్పిలాను చిత్రానికి పిల్లరాక్షసిగా పేరును ఖరారు చేశారు. సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ, ఓ చిన్నారి చేసిన సాహసం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే కథనంతో డిఫరెంట్ కానె్సప్ట్‌తో రియలిస్టిక్ పంథాతో ఈ చిత్రాన్ని సరికొత్త తరహా స్క్రీన్‌ప్లేతో రూపొందించారని తెలిపారు. దుల్కర్‌సల్మాన్ ఈ చిత్రంలో ముఖ్య అతిథిగా నటిస్తున్నారని, త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు అన్నారు. సన్నీ వాయ్‌నె, అంజువర్గిస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భాషాశ్రీ, దర్శకత్వం: మిథున్ మాన్యూన్ థామస్.