శ్రుతి ప్రేమాయణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రేజీ భామ శ్రుతిహాసన్ ఈమధ్య బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. కమల్‌తో ‘శభాష్‌నాయుడు’, పవన్‌కల్యాణ్‌తో ‘కాటమరాయుడు’ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలగాలనే ఈ అమ్మడి ఆశ నెరవేరేలా కలిసిరావడంలేదు. గ్లామర్‌కు పెద్దపీట వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా అందాలు ఆరబోయడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. ఈమధ్య ఈ భామ ఓ బాలీవుడ్ యువ హీరోతో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్నట్లు ముంబయిలో గుసగుసలు విన్పిస్తున్నాయి. బాలీవుడ్ క్రేజీ హీరో రణధీర్‌కపూర్ ఇప్పటికే అటు దీపిక, ఇటు కత్రినాలతో ఘాటు ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. దీపిక పదుకొనె రణబీర్‌ను కాదనుకుని రణ్‌వీర్‌సింగ్ దగ్గరికి వెళ్లింది. కత్రినా కూడా రణబీర్‌కు గుడ్‌బై చెప్పేసింది. దాంతో మనోడు శ్రుతితో ప్రేమాయణంలో పడ్డాడని సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ నైట్ క్లబ్‌లని, పార్టీలని జోరుగా షికారు చేస్తున్నారట. వీరి ప్రేమ పెళ్లిదాకా వెళుతుందో, మధ్యలో ఆగిపోతుందో వేచి చూడాలి.