రాష్ట్రీయం

కల్పవృక్ష వాహనంపై కైవల్య ప్రదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 6: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి తన ఉభయ నాంచారులతో కలిసి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాలు, బహుముఖంగా కీర్తించే దేవతావృక్షం, ప్రకృతి శోభను పెంపొందించే వృక్షాలు సృష్టిలో చాలా ఉన్నాయి. ఆ వృక్షాలు తాముకాచిన ఫలాలను మాత్రమే అందిస్తాయి. కల్పవృక్షం మాత్రం వాంఛిత ఫలాలన్నింటిని ప్రసాదిస్తుంది. శ్రీనివాసుడు భక్తజన కల్పతరువు, కోరిన వరాలనే కాదు కోరని వరాలను కూడా అనుగ్రహిస్తాడు. ఈ కల్పవృక్ష నీడనచేరిన వారికి ఆకలిదప్పులు ఉండవని పూర్వజన్మస్మరణ కలుగుతుందని ఈ వాహన దర్శనం వల్ల స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం అని లోకానికి చెప్పడానికే శ్రీవారు కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మొదట శ్రీ మలయప్పస్వామివారికి శ్రీదేవి, భూదేవి సమేతులై రంగనాయకుల మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై అధిష్టింపచేశారు. జీయ్యంగార్ల వేదగోష్టి, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు ముందు రాగా కల్పవృక్షవాహనంపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.ఈ వాహన సేవలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి దంపతులు, ఇఓ సాంబశివరావు దంపతులు, జెఇఓ శ్రీనివాసరాజు, సివి అండ్ ఎస్‌ఓ శ్రీనివాస్, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి కోదండరామారావు, బోర్డు సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు, జీయ్యంగార్లు తదితర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
సర్వభూపాల వాహనంపై
సర్వాంతర్యామి
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీదేవి, భూదేవిలతో కలిసి గురువారం రాత్రి 9 గంటలకు సర్వభూపాల వాహనంపై తిరులమలలోని మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

చిత్రాలు..తిరుమల మాడ వీధుల్లో సర్వభూపాల వాహన సేవ దృశ్యం

తిరుమల మాడ వీధుల్లో కల్పవృక్ష వాహనంపై విహరిస్తున్న శ్రీవారు