అంతర్జాతీయం

ఓవైపు ఆనందం.. మరోవైపు బాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 22: అమెరికా అధ్యక్షుడి హోదాలో అధ్యక్ష భవనం శే్వతసౌధంలో ఏటా నిర్వహించే సంగీతోత్సవానికి (మ్యూజికల్ ఈవెంట్) బరాక్ ఒబామా చివరిసారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తనకు, తన భార్య మిషెల్లీ ఒబామాకు ఎంతో ఇష్టమైన సంప్రదాయ సంగీతోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం పట్ల తనకు ఒకవైపు ఆనందంగానూ, మరోవైపు బాధగానూ ఉందని బరాక్ ఒబామా అన్నారు. ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత ఎనిమిదేళ్ల క్రితం వైట్‌హౌస్‌లో ప్రతి సంవత్సరం ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించడం ప్రారంభించారు. త్వరలో ఒబామా పదవీకాలం ముగియనున్నందున ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా పాల్గొనడం ఆయనకు ఇదే చివరిసారి. ‘ఈ సాయంత్రం మీరు ఎంత కావాలనుకుంటే అంత మ్యూజిక్ వినండి. గాస్పెల్, ఆర్‌అండ్‌బి, రాప్- ఆఫ్రికన్-అమెరికన్ల జీవితాలలో విడదీయలేని భాగమైపోయాయి. ఈ మ్యూజిక్ కేవలం నల్లవారి సంగీతం మాత్రమే కాదు. అమెరికన్ అనుభవంలో ఇది అత్యవసరమైన భాగం. మనం ఎవరం అనేది చూపించడానికి, మనం ఏం చేయగలమనేది గుర్తు చేయడానికి ఇది అవసరం’ అని 55 ఏళ్ల ఒబామా అన్నారు. ‘ఇది అమెరికన్ మ్యూజిక్ గురించిన చరిత్ర. ఇక్కడినుంచి అన్ని తరాలకు ఈ మ్యూజిక్ చరిత్ర గురించి వైట్‌హౌస్ తెలియజేస్తుందని ఆశిస్తున్నాను’ అని ‘లవ్ అండ్ హ్యాపీనెస్: ఎ మ్యూజికల్ ఎక్స్‌పీరియెన్స్’ పేరిట నిన్నరాత్రి నిర్వహించిన సంగీతోత్సవంలో ఒబామా అన్నారు. తాను, మిషెల్లీ సంగీతాన్ని ఎంతగానో ప్రేమిస్తామని, మిగతా దేశంతో ఈ ఆనందాన్ని పంచుకుంటామని ఆయన వివరించారు. ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమంలో సంగీత దిగ్గజాలు ఇచ్చిన ప్రదర్శనలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.